AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లోనే అక్రమ మద్యం ఫ్యాక్టరీ.. ఐదుగురు అరెస్ట్..

మధ్యప్రదేశ్‌లో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న ఓ ముఠాను ఇండోర్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఇండోర్‌లోని ఖజ్రానా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఇంట్లోనే అక్రమ మద్యం ఫ్యాక్టరీ.. ఐదుగురు అరెస్ట్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 12, 2020 | 7:17 PM

Share

మధ్యప్రదేశ్‌లో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న ఓ ముఠాను ఇండోర్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఇండోర్‌లోని ఖజ్రానా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇండోర్ క్రైం బ్రాంచ్ పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖజ్రానా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఇంట్లోనే అక్రమంగా మద్యం తయారు చేస్తున్నారని పక్కా సమాచారం అందడంతో.. ఇండోర్ క్రైం బ్రాంచ్ పోలీసులు, ఖజ్రానా పోలీసులు కలిసి ఆ ఇంటిపై దాడి చేశారని తెలిపారు. శ్యామ్ సింగ్ అనే వ్యక్తి.. తన ఇంట్లోనే అక్రమంగా దేశీ మద్యం తయారు చేస్తున్నాడని.. అతడితో పాటు మరో నలుగురు కూడా ఉన్నారని తెలిపారు. వీటిని మార్కెట్లో అక్రమంగా సేల్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారని తెలిపారు. వీరి వద్ద నుంచి 320 లీటర్ల స్పిరిట్‌,3.9 లక్షల స్టిక్కర్లు, 6.5 లక్షల లిక్కర్ బాటిల్‌ క్యాప్స్‌,130 లీటర్ల కార్మెల్ కలర్‌, 3000 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరు తయారు చేసిన ఈ అక్రమ మద్యం బాటిళ్లను మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో సప్లై చేస్తున్నట్లు గుర్తించారు.

ఆతిథ్య జట్టుకు భారీ షాక్.. టోర్నమెంట్ నుంచి స్టార్ ఆల్ రౌండర్ ఔట్
ఆతిథ్య జట్టుకు భారీ షాక్.. టోర్నమెంట్ నుంచి స్టార్ ఆల్ రౌండర్ ఔట్
మార్కెట్‌కి మించిన బడ్జెట్‌లు.. రిస్క్ చేస్తున్న మేకర్స్..
మార్కెట్‌కి మించిన బడ్జెట్‌లు.. రిస్క్ చేస్తున్న మేకర్స్..
సీబీఐ అంటూ కాల్ చేశారు.. కట్ చేస్తే వృద్ధుడి అకౌంట్ నుంచి కోటి..
సీబీఐ అంటూ కాల్ చేశారు.. కట్ చేస్తే వృద్ధుడి అకౌంట్ నుంచి కోటి..
స్పామ్ కాల్స్ సులువుగా గుర్తించొచ్చు.. ఎలా అంటే..?
స్పామ్ కాల్స్ సులువుగా గుర్తించొచ్చు.. ఎలా అంటే..?
షుగర్ ఉన్నవాళ్లు రాత్రి జొన్న రొట్టె తినవచ్చా..?
షుగర్ ఉన్నవాళ్లు రాత్రి జొన్న రొట్టె తినవచ్చా..?
సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు షాకిచ్చిన బీసీసీఐ..
సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు షాకిచ్చిన బీసీసీఐ..
పుట్టగొడుగులు చికెన్ కర్రీ.. కూరల్లో అదిరిపోయే కాంబో.. !
పుట్టగొడుగులు చికెన్ కర్రీ.. కూరల్లో అదిరిపోయే కాంబో.. !
ఈ పాటలో ఏదో మ్యాజిక్ ఉంది..ఒక్కసారి వింటే చాలు మనసు తేలికైపోతుంది
ఈ పాటలో ఏదో మ్యాజిక్ ఉంది..ఒక్కసారి వింటే చాలు మనసు తేలికైపోతుంది
బ్యాచిలర్స్‌కు వరం.. మయోన్నైస్ మ్యాజిక్ తో నోరూరించే ఎగ్ డిష్..
బ్యాచిలర్స్‌కు వరం.. మయోన్నైస్ మ్యాజిక్ తో నోరూరించే ఎగ్ డిష్..
నిర్దోషిగా తేలిన కొన్ని గంటలకే కానిస్టేబుల్ మృతి
నిర్దోషిగా తేలిన కొన్ని గంటలకే కానిస్టేబుల్ మృతి