బ్రేకింగ్ న్యూస్: ట్రైన్‌లో ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య
రైలులో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ ఘటన చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ న్యూస్ చెన్నైలో సంచలనం..
రైలులో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ ఘటన చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ న్యూస్ సంచలనంగా మారింది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా-చెన్నైసెంట్రల్ రైల్వే స్టేషన్‌కు మధ్య ప్రతీ రోజూ హౌరా మెయిల్‌ను నడుతున్నారు. రోజూలాగే.. హౌరా నుంచి వచ్చిన ట్రైన్.. ఉదయం 3.30 గంటలకు చెన్నై రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఈ లోపు జనరల్ కోచ్‌లోని బాత్రూమ్‌కి వెళ్లిన ఓ మహిళ ఎంతసేపటికీ రావడం లేదు. దీంతో అనుమానమొచ్చిన ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రైల్వే మెకానిక్ వచ్చి.. తలుపు ఓపెన్ చేసి చూడగా.. అందరూ విస్మయానికి గురయ్యారు. 35 ఏళ్లు ఉన్న మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వైద్యులను పిలిపించినా.. ప్రయోజనం లేకపోయింది. అప్పటికే మహిళ ప్రాణాలు విడిచింది. అయితే ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? అనేది.. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Read More this also: దారుణంగా పడిపోయిన టమాటా ధరలు.. పదికి 3 కిలోలు
శివగామి పాత్ర చేసినందుకు ఫీల్ అవుతోన్న రమ్య
సీఎం జగన్‌పై నాగబాబు సెటైర్స్!
సిల్వర్ స్క్రీన్‌పై ‘కరోనా’ మూవీ
అవకాశం కోసం వెళ్తే.. ఓ నిర్మాత పడకగదికి రమ్మన్నాడు: హీరోయిన్ సంచలన కామెంట్స్..