Pooja Singhal: మనీలాండరింగ్ కేసులో మైనింగ్ కార్యదర్శి అరెస్ట్.. ఈడీ అదుపులో పూజా సింఘాల్‌

|

May 11, 2022 | 6:52 PM

జార్ఖండ్ మైనింగ్ సెక్రటరీ పూజా సింఘాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు రాంచీలో అరెస్టు చేశారు.

Pooja Singhal: మనీలాండరింగ్ కేసులో మైనింగ్ కార్యదర్శి అరెస్ట్.. ఈడీ అదుపులో పూజా సింఘాల్‌
Ias Officer Pooja Singhal
Follow us on

IAS officer Pooja Singhal arrest: జార్ఖండ్ మైనింగ్ సెక్రటరీ పూజా సింఘాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు రాంచీలో అరెస్టు చేశారు. జార్ఖండ్‌లో జాతీయ ఉపాధి హామీ ప‌ధ‌కం(MGNREGA) నిధుల దుర్వినియోగం, ఇతర ఆరోపణలకు సంబంధించిన మనీలాండరింగ్ విచారణకు సంబంధించి సింఘాల్ బుధవారం వరుసగా రెండో రోజు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆమెను ఈడీ అరెస్టు చేసింది. గురువారం రాంచీలోని ప్రత్యేక కోర్టులో పూజాను హాజరుపరచనున్నారు. ఆమె భర్త వ్యాపారవేత్త అభిషేక్ ఝా వాంగ్మూలాన్ని కూడా ఈడీ నమోదు చేసింది. అయితే, పూజ సింఘాల్ భర్తను కూడా ఏ క్షణానైనా అరెస్టు చేయవచ్చని తెలుస్తోంది. పూజా సింఘాల్ ప్రస్తుతం జార్ఖండ్‌లో మైనింగ్ కార్యద‌ర్శిగా ప‌నిచేస్తున్న సంగతి తెలిసిందే.

జార్ఖండ్ ప్ర‌భుత్వంలో జూనియ‌ర్ ఇంజ‌నీర్ రాం వినోద్ ప్రసాద్ సిన్హా మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో అరెస్టయిన క్రమంలో ఇదే కేసులో పూజా సింఘాల్‌, ఇత‌రుల‌పై ఈడీ ద‌ర్యాప్తు సాగుతోంది. ఏప్రిల్ 2008 మార్చి 2011 మ‌ధ్య సిన్హా ప్రభుత్వ నిధుల‌ను త‌న‌తో పాటు త‌న కుటుంబ స‌భ్యుల పేరిట మ‌ళ్లించి దుర్వినియోగానికి పాల్పడినందుకు 2020 జూన్ 17న సిన్హాను బెంగాల్‌లో ఈడీ అరెస్ట్ చేసింది.

ఈ నేపథ్యంలో ఈడీ మే 7న చార్టర్డ్ అకౌంటెంట్ సుమన్ కుమార్‌ను అరెస్ట్ చేసింది. సుమన్ కుమార్ వద్ద ఉన్న రూ.17 కోట్ల నగదును జప్తు చేసి అరెస్ట్ చేశారు. మే 11 వరకు ఈడీ కస్టడీలో ఉన్నాడు. సుమన్ కుమార్ IAS అధికారి పూజ సింఘాల్, ఆమె కుటుంబానికి సంబంధించిన ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. అయితే, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకారం, పూజా సింఘాల్ మరియు ఆమె భర్త వారి బ్యాంకు ఖాతాలలో జీతంతో పాటు రూ.1.43 కోట్ల నగదును పొందారు. సింఘాల్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల జిల్లా మేజిస్ట్రేట్‌గా పోస్టింగ్ సమయంలో ఈ మొత్తాన్ని సంపాదించినట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

ఈ కేసుకు సంబంధించి కోల్‌కతాలో ఏజెన్సీ మళ్లీ దాడులు నిర్వహించింది. సింఘాల్, ఇతరులపై ED దర్యాప్తు మనీలాండరింగ్ కేసుకు సంబంధించినది. దీనిలో జార్ఖండ్ ప్రభుత్వంలో మాజీ ఇంజనీర్ రామ్ బినోద్ ప్రసాద్ సిన్హాను జూన్ 17, 2020న పశ్చిమ బెంగాల్ ఈడీ అరెస్టు చేసింది. PMLA కింద నమోదైన స్టేట్ విజిలెన్స్ బ్యూరో ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలించిన తర్వాత ఏజెన్సీ 2012లో సిన్హాను అరెస్టు చేసింది.

సిన్హాపై భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని క్రిమినల్ సెక్షన్ల కింద ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై మోసం, అవినీతికి సంబంధించిన కేసు నమోదైంది. సిన్హా ఏప్రిల్ 1, 2008 నుండి మార్చి 21, 2011 వరకు జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నప్పుడు తన స్వంత పేరుతో పాటు తన కుటుంబ సభ్యుల పేరు మీద ఈ డబ్బును పెట్టుబడి పెట్టారు. ఖుంటి జిల్లాలో MGNREGA కింద ప్రభుత్వ ప్రాజెక్టుల అమలు కోసం ఈ నిధులు కేటాయించినట్లు ఏజెన్సీ తెలిపింది. వారు జిల్లా పరిపాలనకు ఐదు శాతం కమీషన్ చెల్లించినట్లు సిన్హా ED కి చెప్పారు.

ఇదిలావుంటే, పూజా సింఘాల్ 2007 – 2013 మధ్య కాలంలో ఛత్రా, ఖుంటి, పాలము డిప్యూటీ కమిషనర్, జిల్లా మేజిస్ట్రేట్‌గా పనిచేసిన కాలంలో అక్రమాలకు పాల్పడ్డారని ED ఆరోపించింది.