Hyderabad: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బలిగొన్న పని ఒత్తిడి.. కూతురు కోసం టైం కేటాయించలేక మనోవేధనతో..

|

Aug 03, 2021 | 11:23 AM

పని ఒత్తిడి తట్టుకోలేక ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

Hyderabad: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బలిగొన్న పని ఒత్తిడి.. కూతురు కోసం టైం కేటాయించలేక మనోవేధనతో..
Software Employee Commits Suicide
Follow us on

Software Employee Suicide: పని ఒత్తిడి తట్టుకోలేక ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కోసూరు గ్రామానికి చెందిన జంగం అనిల్‌ కుమార్‌ (34) గచ్చిబౌలి టీసీఎస్‌లో కొన్ని సంవత్సరాల నుంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. భార్య జ్యోతి, కుమార్తె జైష్ణ మాలికతో కలిసి నాలుగున్నర సంవత్సరాలుగా చందానగర్‌లోని కైలాష్‌ నగర్‌ ఎన్డీఆర్‌ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్నారు. ప్రశాంతంగా సాగుతున్న ఫ్యామిలీలో ఒక్కసారిగా కుదుపు వచ్చింది. ఆఫీస్ వర్క్ ఒత్తిడితో కుుటుంబానికి సమయం కేటాయించలేకపోతున్నాన్న బాధతో అనిల్‌కుమార్‌ తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కరోనా వ్యాప్తి కారణంగా అనిల్ కుమార్ వర్క్ ఫ్రం హోం ద్వారా విధులు నిర్వహిస్తున్నాడు. ఇదే క్రమంలో రోజులో అనేకమార్లు ఆఫీసు నుంచి ఫోన్లు చేస్తూ అనేక బాధ్యతలు అప్పగిస్తుండటంతో తీవ్ర మానసిక ఇబ్బంది పడుతున్నాడని అతని భార్య తెలిపింది. సోమవారం ఉదయం కుమార్తె స్కూల్ అడ్మిషన్‌ కోసం భార్యభర్తలు కలిసి వెళదామని నిర్ణయించుకున్నారు. పాఠశాలకు బయలుదేరుతున్న సమయంలోనే ఆఫీసు నుంచి టీం లీడర్‌ సయ్యద్‌ హుస్సేన్‌ ఫోన్‌ కాల్ చేసి అదనపు పని అప్పగించాడు. దీంతో స్కూల్‌కు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నేను పాఠశాలకు రాలేను, నువ్వు వెళ్లి పాఠశాలలో మాట్లాడి రావాలని భార్యని కోరాడు. ఆమె కుమార్తెను తీసుకొని స్కూల్‌కు వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చేసరికి అనిల్‌కుమార్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

Read Also…