Hyderabad Road Accident:హైదరాబాద్ శివారులో పెను ప్రమాదం తప్పింది. ఒక కారు, రెండు బస్సులు డీకొన్నాయి. దీంతో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు స్పాట్‌కు చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారులో వెళుతున్న వ్యక్తి సడెన్‌గా బ్రేక్ వేయడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు వెనకాల ఉన్న ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ప్రాణపాయం తప్పడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.
హైదరాబాద్‌లోని బియన్‌రెడ్డినగర్‌లోని సాగర్ కాంప్లెక్స్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. నాగార్జున సాగర్ రహదారిపై అతి వేగంగా వెళుతున్న కారు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో కారు వెనకాల ఉన్న బస్సులు ఒకదాని వెనుక ఒకటి ఢీకొనడంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు గాయపడిన వారిని అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. కాగా, ఈ ఘటనలో గాయపడ్డ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
Read Also… Karimnagar: హెల్మెట్ పెట్టుకోలేదని సీఐ కొడుకు బైక్ ఆపిన కానిస్టేబుల్.. అతగాడి ఓవరాక్షన్ చూడండి