Busted Remdesivir Black Market: కరోనా సెకండ్ వేవ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో కొందరు కేటుగాళ్లు మనుషు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అత్యవసర వినియోగానికి వాడే రెమ్‌డెసివిర్ కీలక ఔషధాల బ్లాక్ దందా యథేచ్చగా సాగుతోంది. రెమ్‌డెసివిర్ సింగిల్ వయల్‌ను రూ 50,000 వరకు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్న రాకెట్ గుట్టును మంగళవారం హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది రట్టు చేశారు. ఈ కేసులో సంబంధమున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
కోవిడ్ బాధితుల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో బ్లాక్ మార్కెట్ చేస్తూ.. కోవిడ్ -19 కోసం అవసరమైన రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు (కోవిఫోర్) యాంటీవైరల్ మెడిసిన్‌ను అక్రమంగా సేకరించి విక్రయిస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది.. ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. అవసరమైన వినియోగదారులకు రూ .25 వేల నుంచి రూ. 35,000 వరకు అమ్ముతున్నట్లు గుర్తించారు. వీరి నుంచి 5 రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన కిరణ్ కుమార్ మెడికల్ ఏజెన్సీలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్టకు చెందిన మొహద్ ఖలీద్ ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తున్నాడు. అయితే, కోవిడ్-19 రోగులకు యాంటీవైరల్ మెడిసిన్ కోసం ఉపయోగిస్తున్న రెమ్‌డెసివిర్ (కోవిఫోర్) ఇంజెక్షన్ల డిమాండ్‌ను సొమ్ము చేసుకోవాలని భావించాడు. తెలిసిన వారి ద్వారా తక్కువ ధరతో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను సేకరించిన కిరణ్, బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించేందుకు ఫ్లాన్ చేసుకున్నాడు.
ఇదే క్రమంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న మొహద్ ఖలీద్‌తో పరిచయం ఏర్పడింది. ఎవరైనా రెమ్‌డెసివర్ ఇంజన్లు అవసరమైతే సమాచారం ఇవ్వాలని ఇందుకు బహుమతి ఆశ పెట్టాడు. ఇదే క్రమంలో కిరణ్.. మొహద్ ఖలీద్‌కు రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను సరఫరా చేయడం ప్రారంభించాడు. ఇందుకు సంబంధించి పక్కా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది అఫ్జల్‌గంజ్ పోలీసుల సాయంతో కిరణ్ కుమార్, మొహద్ ఖలీద్‌ను అదుపులోకి తీసుకుని వారి నుంచి ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోద చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also…… Telangana Lockdown: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. లాక్‌డౌన్‌ను పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..