Hyderabad: యువతిపై రేప్ కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కుమారుల అరెస్ట్..

|

Jun 03, 2022 | 8:01 PM

ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్ బోర్టు చైర్మన్ కుమారుడిని పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేశారు.

Hyderabad: యువతిపై రేప్ కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కుమారుల అరెస్ట్..
Rape Case
Follow us on

Hyderabad Gangrape Case: హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్‌ పరిధిలో పబ్‌కు వెళ్లిన యువతి (17)పై కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. సంచలనంగా మారిన ఈ రేప్ కేసులో అరెస్టులు మొదలయ్యాయి. ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్ బోర్టు చైర్మన్ కుమారుడిని పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. నిందితులు రహేల్‌, అహుల్లాఖాన్‌ను సిటీ శివారులో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రహేల్‌ఖాన్‌.. బహదూర్‌పురా ఎమ్మెల్యే మహ్మద్ మోజం ఖాన్ కుమారుడు కాగా.. అహుల్లాఖాన్‌ వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ కుమారుడు. వీరిద్దరిని పోలీసులు నగర శివారులో అరెస్ట్ చేశారు.

ఇదిలాఉంటే.. హైదరాబాద్‌లో రేప్ ఘటన వార్తలు చూసి షాక్ తిన్నానంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బాధ్యులు ఎంతటివారైనా వదలొద్దని హోంమంత్రి, డీజీపీ, సిటీ సీపీని కోరారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు.

ఇవి కూడా చదవండి

కాగా.. రేప్ కేసులో నిందితులను అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆందోళనకు దిగిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..