Hyderabad: హైదరాబాద్‌లోని అయ్యప్ప సొసైటీలో పేకాట డెన్‌పై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఎనిమిది మంది పేకాటరాయుళ్లను (Playing Cards) పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఏకంగా రూ. 90 లక్షల నగదును స్వాధీనం చేసుకోవడం గమనార్హం. సోమవారం రాత్రి కొందరు ప్రముఖులు పేకాట ఆడుతున్నట్లు డీసీపీకి (Hyderabad DCP) సమాచారం అందడంతో మెరుపు దాడి చేసి ఈ పేకాట రాయుళ్ల గుట్టురట్టు చేశారు. పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో పేకాట ఆడుతున్న సమయంలో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. కాకతీయ హిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు గుట్టురట్టు చేశారు. పట్టుబడ్డ ఎనిమిది మందిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేకాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
Amul Milk: అమూల్ పాల ధరలు మరింత ప్రియం.. ఎంత పెరగనున్నాయంటే..
Amul Milk: అమూల్ పాల ధరలు మరింత ప్రియం.. ఎంత పెరగనున్నాయంటే..