Weight Loss Tips: కేవలం 10 రోజుల్లో బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ పని చేయండి..!

బరువు తగ్గాలి అనుకునేవారికి చాలామంది చాలా చిట్కాలు చెబుతూ ఉంటారు. బరువు తగ్గడానికి ఈ పని చేయండి ఆ పని చేయండి అంటారు...

Weight Loss Tips: కేవలం 10 రోజుల్లో బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ పని చేయండి..!
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 28, 2022 | 6:54 PM

బరువు తగ్గాలి అనుకునేవారికి చాలామంది చాలా చిట్కాలు చెబుతూ ఉంటారు. బరువు తగ్గడానికి ఈ పని చేయండి ఆ పని చేయండి అంటారు. కానీ వాస్తవానికి చాలావరకు వాటికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఆరోగ్యంగా బరువు తగ్గడం అనేది క్రమంగా జరిగే ప్రక్రియ మీ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా సులువుగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని చిట్కాలు క్రమం తప్పకుండా పాటిస్తే బరువు తగ్గొచ్చని వివరిస్తున్నారు. మరి బరువు తగ్గే చిట్కాలు ఏంటో చూద్దామా..

పీచు పదార్థాలు

మీ ఆహారంలో ఎక్కువ పీచు పదార్థాలను ఉండేటట్టుగా చూసుకోండి. రోజుకు 30 గ్రాములు పీచు పదార్థాలు తినాలి. కానీ చాలా మంది తగినంత పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోరు. కొన్ని అధ్యయనాలు ప్రకారం పీచు పదార్థాలు దీర్ఘకాలికంగా మీ బరువు తగ్గడానికి మీకు సహాయపడతాయని నిరూపిస్తున్నాయి. ఇది ఎలా సహాయపడుతుంది?

నీరు

నీళ్లు కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. తగినంత నీరు తీసుకోవాలి. నీళ్లు జీవక్రియను పెంచుతాయి.

గ్రీన్ టీ

గ్రీన్ టీ కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రీన్ టీలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి బరువును తగ్గిస్తాయి.

వ్యాయామం

యోగ, ఏరోబిక్ వ్యాయామం చేస్తే శరీరంలోని కేలరీలు తగ్గి బరువు తగ్గుతారు. ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం మంచిది.

నిద్ర

చాలా మంది సరిగా నిద్రపోరు. దీని వల్ల వారు బరువు పెరిగే అవకాశం ఉంది. అలా అని ఎక్కువగా నిద్ర పోయినా సమస్యలు వస్తాయి. తొందరగా నిద్రపోయి ఉదయాన్నే లేస్తే ఆరోగ్యం బాగుంటుంది.

ప్రోటీన్

బరువు తగ్గడానికి ప్రోటీన్ అతి ముఖ్యమైన పోషకం. అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం తినడం వల్ల రోజుకు 80–100 కేలరీలు తగ్గించే జీవక్రియను పెంచుతాయని తేలింది.

కూల్ డ్రింక్స్ అసలు తాగవద్దు

సోడాలు, కూల్ డ్రింక్ తాగడం వల్ల బరువు పెరుగుతారు. కూల్ డ్రింక్స్ వల్ల వచ్చే కేలరీలు కొవ్వుగా మారుతాయి.

చిన్న చిన్న మార్పులు

చిన్న చిన్న మార్పులే చాలా ప్రభావం చూపుతాయి. ఉదాహరణకి ఎలివేటర్‌కు బదులుగా మెట్లు ఎక్కండి. దగ్గర్లోలో షాపింగ్ వెళ్లాల్సిన అప్పుడు బైక్ కారుకు బదులుగా నడుచుకుంటూ వెళ్లి హాయిగా షాపింగ్ చేసి రండి.

ఇంటిలోనే భోజనం

మీ సొంత భోజనం వండుకోవడం చాలా ముఖ్యమైంది. బయట లభించే ఆహార పదార్థాలు ఎక్కువగా డాల్డా, నాసిరకమైన నూనెను వాడుతూ ఉంటారు. వీటివల్ల మీరు బరువు అధికంగా పెరుగుతారు.

అల్పాహారం

చాలామంది ఉదయాన్నే టిఫిన్ తినరు. ఏముందిలే అనుకుంటారు. కానీ ఇది చాలా పొరపాటు టిఫిన్ తినకపోతే బరువు తగ్గడం కాదు బరువు పెరుగుతారు.

గమనిక: అందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించాలి.

Read Also.. Juice Side Effects: ఆ వ్యాధి ఉన్నవారు పరగడుపున ఫ్రూట్ జ్యూస్ తాగితే ప్రమాదమే! ఈ విషయాలు తెలుసుకోండి..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!