Hyderabadi young men drowned: ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల్ని పంచ ప్రాణాలుగా చూసుకుంటూ పెంచుతుంటారు. కానీ పిల్లలు చేసే చిన్న చిన్న పొరపాట్లు తల్లిదండ్రులను దుఃఖసాగరంలో ముంచెత్తుతున్నాయి. అలాంటి ఘటన హైదరాబాద్ బోరబండలో చోటచుచేసుకుంది. సరదా కోసం చెరువులోకి దిగిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువకులు నీటిలో గల్లంతై మరణించారు. వాళ్లందరూ కూడా 20 ఏళ్ల లోపు యువకులు. దీంతో వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. దర్గా దర్శనం కోసం కర్ణాటక వెళ్లిన హైదరాబాద్ నగరంలోని ఓ కుటుంబానికి.. అనుకోని సంఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
వివరాల ప్రకారం.. హైదరాబా్ నగరంలోని బోరబండకు చెందిన ఓ కుటుంబం బీదర్ జిల్లా గోడవాడి గ్రామంలోని హజ్రత్ ఇస్మాయిల్ షా ఖాద్రి దర్గాను దర్శించుకునేందుకు వెళ్లారు. హజ్రత్ ఇస్మాయిల్ షా ఖాద్రి దర్గాను దర్శించుకున్న అనంతరం సమీపంలోని చెరువులో ఈతకు వెళ్లారు. అనంతరం చెరువులో లోతు ఎక్కువగా ఉండటంతో సయ్యద్ అక్బర్ సయ్యద్ ఉస్మాన్(17), మహమ్మద్ జునైద్ ఖాన్(19), మహమ్మద్ ఫదాఖాన్ సలీంఖాన్(18), సయ్యద్ జునైద్ సయ్యద్ ఖలీద్(15) నీటిలో గల్లంతయ్యారు. నలుగురు యువకులు కూడా లోతు సరిగా అంచనా వేయలేకపోయవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదట ఒకరు నీటిలో మునిగిపోగా అతన్ని కాపాడేందుకు ముగ్గురు యత్నించారు. వారికి కూడా ఈత రాకపోవడంతో మృత్యువాత పడినట్లు పోలీసులు వెల్లడించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఇటీవలే మరమ్మతుల్లో భాగంగా చెరువును లోతుగా తవ్వారు. మొదట చెరువులో గల్లంతయింది ఎవరని గుర్తించలేదు. చెరువు గట్టు మీద ఉన్న బట్టల ఆధారంగా తమపిల్లలే అని కుటుంబసభ్యులు గుర్తించడంతో.. పోలీసులు, అధికారులు చేరుకుని.. చెరువులో గాలింపు చర్యులు చేపట్టారు. నాలుగు గంటల తర్వాత నలుగురు యువకుల మృతదేహాలను బయటకు వెలికితీశారు. మృతిచెందిన చెందిన నలుగురిలో ఇద్దరు సొంత అన్నదమ్ములు ఉన్నారు. ఈ ఘటనతో బోరబండ వాసులు విషాదంలో మునిగిపోయారు.
Also Read: