Shamshabad Airport Drugs: హైదరాబాద్ మహానగరంలో భారీగా అక్రమ డ్రగ్స్ రవాణా గుట్టురట్టైంది. విదేశాల నుంచి యథేచ్చగా అక్రమ దందా నిర్వహిస్తున్న కేటుగాళ్లకు డీఆర్ఐ అధికారులు చెక్ పెట్టారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. రూ.20 కోట్ల విలువైన హెరాయిన్‌ను ఎయిర్‌పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
టాంజానియా నుంచి వచ్చిన జాన్ విలియమ్స్ అనే వ్యక్తి నుంచి దీన్ని మత్తు మందును స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాపై ఆరా తీస్తున్నారు. అతనికి హైదరాబాద్‌తో ఉన్న లింకులపై కూపీ లాగుతున్నారు. ఇటీవల అంతర్జాతీయంగా డ్రగ్స్ సరఫరా పెరిగిందన్న నిఘా వర్గాల సమాచారంతో అధికారులు.. ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఇదే క్రమంలోనే హైదరాబాద్, చెన్నై వంటి ఎయిర్‌పోర్టుల్లో అప్పుడప్పుడు డ్రగ్స్ పట్టుబడుతూ వస్తోంది. జాన్ విలియమ్స్‌ను అరెస్ట్ చేసిన డీఆర్ఐ అధికారులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also…
Hyderabad Metro Train: హైదరాబాద్ మెట్రో రైలు సమయం పెంపు.. నేటి నుంచి రాత్రి 10గంటల వరకు పరుగులు