Missing in Goa: గోవాలో అసలేం జరిగింది.. శరీరంపై కుట్లతో తిరిగొచ్చిన హైదరాబాద్ వాసి..

|

Apr 06, 2022 | 8:13 AM

Hyderabad man goes missing in Goa: పర్యాటకులతో గోవా వెళ్లిన హైదరాబాద్ బోరాబండకు చెందిన శ్రీనివాస్ ఆందోళన కరంగా ఇంటికి చేరుకున్నాడు. తల, కడుపు భాగంలో కుట్లు వేసి ఉండడంతో కుటుంబసభ్యులు

Missing in Goa: గోవాలో అసలేం జరిగింది.. శరీరంపై కుట్లతో తిరిగొచ్చిన హైదరాబాద్ వాసి..
Crime News
Follow us on

Hyderabad man goes missing in Goa: పర్యాటకులతో గోవా వెళ్లిన హైదరాబాద్ బోరాబండకు చెందిన శ్రీనివాస్ ఆందోళన కరంగా ఇంటికి చేరుకున్నాడు. తల, కడుపు భాగంలో కుట్లు వేసి ఉండడంతో కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 19వ తారీఖున 10 మంది పర్యాటకులతో కలిసి గోవా వెళ్లిన టెంపో డ్రైవర్ శ్రీనివాస్.. అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత తల కడుపు భాగంలో కుట్లతో ఇంటికి చేరుకున్నాడు. గోవా వెళ్లిన సమయంలో తనను ఎవరో తమకు సహకరించాలని డబ్బులు ఇస్తామని అన్నారని చెప్పారని శ్రీనివాస్ వెల్లడించాడు. దానికి నిరాకరించానని ఆ తర్వాత వారు ఇచ్చిన ఇంజక్షన్లతో స్పృహ కోల్పోయినట్లు కుటుంబ సభ్యులతో శ్రీనివాస్ చెప్పాడు. ఆ తర్వాత దాదాపు పది రోజులు పైనే ఒక రహస్య ప్రదేశంలో ఉంచారని అక్కడ తనతో పాటు మరొక 15 మంది వరకు ఉన్నారని శ్రీనివాస్ పేర్కొంటున్నాడు.

అయితే.. శ్రీనివాస్ ఏప్రిల్ 4వ తేదీన ఇంటికి చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులు లోకల్ కార్పొరేటర్ ఫసియూద్దీన్ సంప్రదించారు. దీంతో బాధితుడిని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. నిమ్స్ ఆసుపత్రి వైద్యులు.. శ్రీనివాస్ కు అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత అన్ని ఆర్గాన్స్ సరిగ్గా పని చేస్తున్నాయని తెలిపారని కార్పొరేటర్ ఫసిఉద్దీన్ పేర్కొన్నారు.

ఆర్గాన్లు అన్ని పని చేస్తున్న తలా భాగంలోని స్కల్స్ కడుపులో పెట్టి కుట్లు వేశారని వైద్యులు అంటున్నారు. అసలు ఎందుకు ఇలా చేసారని పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే గోవాలోని అంజునా పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే.. అవయవాలు అన్ని ఉంటే.. శ్రీనివాస్ పై క్లినికల్ ట్రయల్స్ చేసారా..? అనే అనుమానం వ్యక్తం అవుతోంది.

Also Read:

Petrol Diesel Price Today: తగ్గేదెలే.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. రూ. 120 మార్క్ దాటి పరుగులు..

Karnataka CM: బెంగళూరును హైదరాబాద్‌తో పోల్చడం హాస్యాస్పదం.. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కర్ణాటక సీఎం