Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. యువతిని బైక్‌పై తీసుకెళ్లినందుకు ఓ యువకుడిపై దాడి.. పోలీసుల ఎంట్రీతో..

Attack on Young Man: హైదరాబాద్‌లో కూడా అల్లరిమూక చెలరేగిపోయింది. ఓ వర్గానికి చెందిన యువతిని ఇంకో వర్గానికి చెందిన యువకుడు బైక్‌పై తీసుకెళ్లడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోయారు.

Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. యువతిని బైక్‌పై తీసుకెళ్లినందుకు ఓ యువకుడిపై దాడి.. పోలీసుల ఎంట్రీతో..
Attack On Young Man

Updated on: Sep 28, 2021 | 10:11 PM

Hyderabad Crime News: హైదరాబాద్‌లో కూడా అల్లరిమూక చెలరేగిపోయింది. ఓ వర్గానికి చెందిన యువతిని ఇంకో వర్గానికి చెందిన యువకుడు బైక్‌పై తీసుకెళ్లడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. నవీన్ అనే యువకుడిపై దాడి చేశారు. విరక్షణారహితంగా చితకబాదారు. దీంతో ఆ యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఈ అమానుష ఘటన హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లి బజార్ ఘాట్ ప్రాంతంలో విజయవాడకు చెందిన నవీన్ గత కొంతకాలంగా స్థానికంగా పని చేస్తూ నివాసం ఉంటున్నాడు. విజయవాడకు చెందిన తన స్నేహితురాలు ఉద్యోగ ప్రయత్నం కోసం నగరానికి వచ్చింది. నవీన్‌తో కలిసి ఇంటర్వ్యూకు వెళ్లి తిరిగివస్తుండగా, వారిని నాంపల్లి బజార్ ఘాట్ లో కొంత మంది యువకులు అడ్డగించారు. పరమతానికి చెందిన వ్యక్తితో ఎలా తిరుగుతావని సదరు యువతిని నిలదీశారు. దీంతో ఆగకుండా నవీన్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.

కాగా, ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త ఇప్పుడు వైరల్ కావడంతో నాంపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. ఈ దాడికి పాల్పడిన నలుగురు యువకులు గుర్తించారు. నాంపల్లి ప్రాంతానికి చెందిన రషీద్ , షేక్ అహ్మద్ , అలీ , పక్లెవ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మతసామరస్యానికి ప్రతీక అయిన హైదరాబాద్‌లో ఘటనలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Read Also… AP Crime News: విజయవాడలో మరో దారుణం.. భర్త కళ్ల ముందే భార్య ఆత్మహత్య.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!

Love Story : ఒక పాత్ర చేస్తే అది మనసులో ఉండిపోవాలి.. అలాంటి సినిమానే ఇది: సాయి పల్లవి