AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Husband Kills Wife: అనుమానం పెను శాపమైంది.. నిండు ప్రాణాన్ని బలిగొంది.. అనంతపురంలో దారుణం..

Husband Kills Wife: అనుమానం పెను శాపమై ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. పిల్లలను తల్లి లేని వారి చేసింది. భార్యపై అనుమానంతో హత్య చేసిన ఘటన అనంతపురంలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..

Husband Kills Wife: అనుమానం పెను శాపమైంది.. నిండు ప్రాణాన్ని బలిగొంది.. అనంతపురంలో దారుణం..
Huband Kill Wife
Narender Vaitla
|

Updated on: Mar 26, 2021 | 9:55 AM

Share

Husband Kills Wife: అనుమానం పెను శాపమై ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. పిల్లలను తల్లి లేని వారి చేసింది. భార్యపై అనుమానంతో హత్య చేసిన ఘటన అనంతపురంలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కణేకల్లుకు చెందిన చిక్కనయ్య, కర్నూలు జిల్లా చిప్పగిరి సమీపంలోని సంచెర్ల గ్రామానికి చెందిన కవిత అనే మహిళను 13 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అనంతపురంలో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరికి సంతోష్‌, జాహ్నవి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉద్యోగం, పిల్లలతో సంతోషంగా గడుస్తోన్న వారి కుటుంబంలో అనుమానం పెను భూతమైంది. గత కొంత కాలంగా కవిత నంచెర్లలో పరిచయం ఉన్న ఓ ఆర్‌ఎంపీ డాక్టర్‌తో తరచూ ఫోన్‌చేసి మాట్లాడడాన్ని తప్పుపట్టిన భర్త.. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. ఈ క్రమంలోనే కరోనా కారణంగా పాఠశాలలు మూతపడడంతో కవిత ఇద్దరి పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. తాజాగా పాఠశాలలు తిరిగి ప్రారంభంకావడంతో కవితను తిరిగి అనంతపురం తీసుకొచ్చాడు చిక్కనయ్య. అయితే భార్య ప్రవర్తనలో ఎంతకు మార్పు రాకపోవడంతో చిక్కనయ్య భార్యపై గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి భార్యభర్తలు ఇద్దరి మధ్య తీవ్ర వివాదం రాజుకొంది. దీంతో కోపంతో ఊగిపోయిన చిక్కనయ్య గురువారం తెల్లవారుజామున అక్కడే ఉన్న లుంగీని గొంతుకు బిగించి కవితను చంపేశాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ వీరరాఘవ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని శవపరీక్షలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Medical Student Suicide: ప్రాణం తీసిన ప్రేమ.. వైద్య విద్యార్థి బలవన్మరణం.. సిద్ధిపేట జిల్లాలో విషాద ఘటన..

కాల్ పేరుతో కనెక్ట్ అయ్యాడు.. చనువుగా మాట్లాతుండటంతో రెచ్చిపోయాడు.. సీన్ కట్ చేస్తే జైలుపాలయ్యాడు..

కన్నడనాట రాసలీలల వ్యవహారం మరో ట్విస్ట్.. రెండో సీడీని విడుదల చేసిన యువతి.. అందులో ఏముందంటే..?