drugs seized in Lakshyadweep : అధికారులు ఎన్ని విధాల ప్రయత్నించినా మత్తు పదార్థాల రవాణాను అరికట్టలేకపోతున్నారు. నిత్యం నగరాల్లో రాష్ట్ర సరిహద్దుల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ చేతులు మారుతున్నాయి. కొంతమంది వ్యక్తులు రాజకీయ నేతల అండదండలతో యథేచ్ఛగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. నగరాల్లోని పబ్‌లు, రిసార్ట్లు తదితర వాటిల్లో విక్రయాలు జరుపుతున్నారు. అక్రమంగా కోట్లు గడిస్తున్నారు. అయితే అమాయకులైన విద్యార్థులు, యువతులు, బడాబాబుల పిల్లలే వీరి టార్గెట్‌గా వ్యాపారం నడుస్తోంది. అంతేకాకుండా యువత వీటి భారిన పడి అనారోగ్యాలకు గురై ఒళ్లు గుళ్ల చేసుకుంటున్నారు.
తాజాగా లక్షద్వీప్ లో డ్రగ్స్ భారీగా పట్టుబడ్డాయి. ఆరుగురు శ్రీలంక దేశస్తులను కోస్ట్‌గార్డు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గరి నుంచి 200 కిలోల హెరాయిన్, 60 కిలోల హాశిస్ మత్తు పదార్ధాలను గుర్తించారు. ఈ డ్రగ్స్ విలువ దాదాపు రూ. వేయి కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అయితే ఈ డ్రగ్స్ రాకెట్ ఇంకా చాలా దేశాలకు పాకి ఉన్నట్లుగా తెలుస్తోంది. కోస్ట్‌గార్డు అధికారులు శ్రీలంక దేశస్తులని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నైజీరియా దేశస్థులకు సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.