Fire Accident: కృష్ణాజిల్లాలో ఘోర ఆగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన 10 పూరిళ్లు.. జనం గాఢ నిద్రలో ఉండగా ఘటన
కృష్ణాజిల్లాలో ఘోర ఆగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాపం పేదల ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. మూగజీవాలు సజీవదహనమయ్యాయి. అత్యంత విషాదకరమైన ఈ ఘటన..
Fire Broke Out: కృష్ణాజిల్లాలో ఘోర ఆగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాపం పేదల ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. మూగజీవాలు సజీవదహనమయ్యాయి. అత్యంత విషాదకరమైన ఈ ఘటన తోట్లవల్లూరు మండలం కుమ్మమూరులో జరిగింది. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. రాత్రి సమయంలో ఓ ఇంట్లో ఒక్కసారిగా చెలరేగాయి మంటలు..క్షణాల్లోనే పక్కనే ఉన్న ఇళ్లకూ వ్యాపించాయి.
ఈ ఘటనలో 10 పూరిళ్లు కాలిబూడిదవగా..12 గొర్రెలు సజీవ దహనమయ్యాయి. లక్షల్లో ఆస్తినష్టం జరిగింది. సమాచారమందుకొని అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపుచేశారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇవి కూడా చదవండి
Today Gold Price: భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
Viral: ఇంటర్ స్టూడెంట్ అందమైన ప్రేమలేఖ.. అమ్మాయి రెస్పాన్స్ అదుర్స్.. అసలు ఏం చెప్పిందంటే.!