CRIME NEWS : హరిద్వార్‌ గంగా నది ఒడ్డున హుక్కా పార్టీ..! హర్యానాకు చెందిన ఆరుగురు అరెస్ట్..

| Edited By: Janardhan Veluru

Jul 09, 2021 | 10:03 AM

CRIME NEWS : హర్యానా, యుపి, ఢిల్లీ ప్రజలు ఉత్తరాఖండ్ సందర్శించడానికి వస్తారు కానీ చాలా మంది ప్రజలు తమ పరిమితిని దాటుతున్నారు.

CRIME NEWS : హరిద్వార్‌ గంగా నది ఒడ్డున హుక్కా పార్టీ..! హర్యానాకు చెందిన ఆరుగురు అరెస్ట్..
Crime News
Follow us on

CRIME NEWS : హర్యానా, యుపి, ఢిల్లీ ప్రజలు ఉత్తరాఖండ్ సందర్శించడానికి వస్తారు కానీ చాలా మంది ప్రజలు తమ పరిమితిని దాటుతున్నారు. పవిత్ర నగరం హరిద్వార్ నుంచి ఇటీవల ఒక కేసు వెలుగులోకి వచ్చింది. కొంతమంది యువకులు గంగా ఒడ్డున గుంపుగా చేరి హుక్కా తాగుతున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని హర్యానాకు చెందిన 6 గురిని అరెస్టు చేశారు.

గత కొద్ది రోజులుగా ఇలాంటి కేసులు చాలావరకు హరిద్వార్ నుంచి వస్తున్నాయి. కొంతమంది యువకులు హర్కి పౌరి వద్ద ఘంటాఘర్ సమీపంలో గంగా నది ఒడ్డున కూర్చుని హుక్కా తాగుతున్నారు. స్థానిక యాత్రికులు-పూజారులు వారిని నిలదీసినప్పుడు దుర్భాషలాడుతూ గొడవ చేస్తారు. ఇరువైపుల మధ్య గొడవ పెరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేస్తారు. హుక్కా ధూమపానం చేస్తున్న హర్యానాకు చెందిన 6గురు యువకులను అరెస్టు చేస్తారు.

ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు సిసిటివిలను అమర్చుతున్నామని ఎస్పీ సిటీ కమలేష్ ఉపాధ్యాయ్ చెప్పారు. ఇప్పటికీ అటువంటి కేసులపై సమాచారం అందిన తరువాత, తక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొద్ది రోజుల క్రితం హరిద్వార్ హర్ కి పైడి వద్ద ఇలాంటి మరో కేసు నమోదైంది. ఇందులో కొంతమంది అసభ్యకరమైన పాటలపై డ్యాన్స్ చేశారు. ఈ సంఘటన వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది.

China : కుటుంబ నియంత్రణ పాటించని వ్యక్తికి రూ.3 కోట్ల ఫైన్.. చివరకు రూ.10 లక్షలకు తగ్గింపు..

ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్.. పాతాళలోకానికి వెళ్లిన ఫీలింగ్.. వీడియో చూస్తే అద్భుతం..

VIRAL VIDEO : చాక్లెట్‌తో ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’ తయారీ..! ఎలా చేశాడో వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..

Jammu Kashmir Encounter : సుందర్ బానీ సెక్టార్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం.. అమరులైన ఇద్దరు జవానులు..