Honor Killing: తమిళనాడులో దారుణం.. కులాంతర వివాహం చేసుకున్నాడని యువకుడి తల నరికేశారు..

| Edited By: Phani CH

Oct 21, 2021 | 6:25 AM

Honor Killing: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. కులాంతర వివాహం ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి బంధువులు యువకుడిని

Honor Killing: తమిళనాడులో దారుణం.. కులాంతర వివాహం చేసుకున్నాడని యువకుడి తల నరికేశారు..
Murder
Follow us on

Honor Killing: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. కులాంతర వివాహం ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి బంధువులు యువకుడిని అత్యంత కిరాతకంగా తల నరికి చంపేశారు. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టిలో చోటు చేసుకుంది. ఈ దారుణానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోవిల్పట్టికి చెందిన రాఘవన్, మహాలక్ష్మి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని భావించారు. అయితే కులాలు వేరు కావడంతో వారి వివాహానికి మహాలక్ష్మి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దాంతో రాఘవన్, మహాలక్ష్మి రిజిస్టర్ ఆఫీస్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత వేరు కాపురం పెట్టారు. రాఘవన్ టీవీ మెకానిక్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, వేరే కులానికి చెందిన వ్యక్తి తమ బిడ్డను పెళ్లి చేసుకోవడంతో మహాలక్ష్మి కుటుంబ సభ్యులు పగ పెంచుకున్నారు.

ఆ పగతోనే.. ఇవాళ టీవీ మెకానిక్‌ షాపులో పని చేస్తున్న రాఘవన్‌పై దాడికి తెగ బడ్డారు. వేట కత్తులతో దాడి చేశారు. అత్యంత క్రూరంగా తల నరికి చంపేశారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ భీకర దృశ్యాలను చూసి స్థానికులు బెంబేలెత్తిపోయారు. రాఘవన్ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రాఘవన్ మృతదేహాన్ని, తలను ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, రాఘవన్‌ను చంపిన దుర్మార్గులను వెంటనే పట్టుకోవాలని, కఠినంగా శిక్షించాలని అతని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. రోజుల వ్యవధిలోనే తనకు దూరమైపోవడంతో మహాలక్ష్మి బోరున విలపిస్తోంది.

Also read:

Telangana News: ఇదేం పిట్టరా బాబోయ్‌.. హెల్మెట్ ఉంటేనే పెరట్లోకి వెళ్లాలి.. లేదంటే అంతే సంగతి..!

Chandrababu vs YS Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి.. రాష్ట్రపతి, ప్రధాని, హోమంత్రికి లేఖ రాసిన చంద్రబాబు..

TDP vs YCP: మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు దీక్ష.. అనుమతి ఇచ్చిన పోలీసులు..