AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Work: శాడిస్ట్ టీచర్.. హోం వర్క్ చేయలేదని పిల్లోడిని కొట్టి చంపేశాడు..తర్వాత ఏమైందంటే..

ఉపాధ్యాయుడికి కావలసింది ఓపిక. పిల్లలను ప్రేమతో చూడగలిగే గుణం. ఆ రెండూ ఆ శాడిస్టు టీచర్ కి లేవు. తన పదమూడేళ్ళ విద్యార్ధిని చచ్చేలా కొట్టాడు.

Home Work: శాడిస్ట్ టీచర్.. హోం వర్క్ చేయలేదని పిల్లోడిని కొట్టి చంపేశాడు..తర్వాత ఏమైందంటే..
Home Work
KVD Varma
|

Updated on: Oct 20, 2021 | 8:49 PM

Share

Home Work: ఉపాధ్యాయుడికి కావలసింది ఓపిక. పిల్లలను ప్రేమతో చూడగలిగే గుణం. ఆ రెండూ ఆ శాడిస్టు టీచర్ కి లేవు. తన పదమూడేళ్ళ విద్యార్ధిని చచ్చేలా కొట్టాడు. ఆ విద్యార్ధి చేసిన తప్పు కేవలం హోం వర్క్ చేయకపోవడమే. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఈ హృదయ విదారక సంఘటన రాజస్థాన్‌లోని చురు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని సలాసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొలాసర్ గ్రామంలో ఎడో తరగతి చదువుతున్న విద్యార్ధి బుధవారం హోంవర్క్ చేయకుండా స్కూల్ కి వెళ్ళాడు. దీంతో ఉపాధ్యాయుడికి కోపం వచ్చింది. ఇంకేముంది. ఆ విద్యార్ధిని గొడ్డును బాదినట్టు బాదేశాడు.

టీచర్ ఆ విద్యార్ధిని ముక్కు నుంచి రక్తం వచ్చేంత వరకు అతనిని నేలమీద పడవేసి తన్నాడు. దాంతో ఆ విద్యార్ధి మూర్ఛపోయాడు. కొంత సమయం వరకు అతనికి స్పృహ రాకపోవడంతో, టీచర్ అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారి చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడైన ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. తల, కళ్ళు.. నోటిపై గాయాలు

ఆ విద్యార్ధి పేరు గణేష్. అతని తల, కళ్ళు, నోటిపై గాయాలు ఉన్నాయని తండ్రి చెప్పాడు. ఈ పాఠశాల ఉపాధ్యాయుడి తండ్రి బన్వారీ లాల్‌కు చెందినదని పోలీసులు తెలిపారు. పిల్లవాడు మోడరన్ పబ్లిక్ స్కూల్లో మొదటి తరగతి చదువుతున్నాడు. నివేదికను నమోదు చేసిన తర్వాత పోస్టుమార్టం జరుగుతోంది. దీని తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తారు.

కొలసర్ గ్రామానికి చెందిన గణేష్ ప్రైవేట్ పాఠశాలలో చదివుతున్నట్లు సలాసర్ పోలీసు అధికారి సందీప్ విష్ణోయ్ తెలిపారు. బుధవారం ఉదయం విద్యార్ధి పాఠశాలకు వెళ్ళాడు. అక్కడ హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయుడు మనోజ్ అతడిని కొట్టాడు. ఈ కారణంగా అతను ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి నివేదికపై, ఉపాధ్యాయుడిపై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇవి కూడా చదవండి: Telegram App: వంద కోట్ల డౌన్‌లోడ్‌లతో దూసుకుపోతున్న టెలిగ్రామ్ యాప్.. పదిహేను రోజుల్లో భారీగా చేరిన యూజర్లు..

Future Tech 2021: భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో ఫ్యూచర్ టెక్ 2021 ఈవెంట్.. ఆన్‌లైన్‌లో మీరూ పాల్గొనవచ్చు ఇలా!

India vs Pakistan: పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన దుబాయ్.. కాశ్మీర్‌‌లో మౌలిక సదుపాయాల కోసం భారీ పెట్టుబడులు!