Kinnaur Landslide: హిమాచల్ ప్రదేశ్‌లో 13కి పెరిగిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు..

|

Aug 12, 2021 | 12:33 PM

Himachal Pradesh Landslide: హిమాచల్‌ప్రదేశ్‌ కన్నౌర్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. నిన్న కొండచిరియలు విరిగి వాహనాలపై

Kinnaur Landslide: హిమాచల్ ప్రదేశ్‌లో 13కి పెరిగిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు..
Himachal Pradesh Landslide
Follow us on

Himachal Pradesh Landslide: హిమాచల్‌ప్రదేశ్‌ కన్నౌర్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. నిన్న కొండచిరియలు విరిగి వాహనాలపై పడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇంకా అధికారులు సహాయక చర్యలను వేగవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందారని, 40 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఇప్పటివరకు14 మంది క్షతగాత్రులను రక్షించినట్లు తెలిపారు. మృతుల్లో చిన్నారి సహాయ ఐదుగురు మహిళలు ఉన్నారు. బుధవారం ఉదయం నేషనల్‌ కన్నౌర్‌ జిల్లాలోని రెహ్లాన్‌ – సియో హైవేపై వాహనాలు వెళ్తున్న సమయంలో పెద్ద పెద్ద బండరాళ్లు ఎత్తయిన కొండప్రాంతం నుంచి పడిపోయిన విషయం తెలిసిందే. చాలా వాహనాలపై కొండచరియలు విరిగిపడ్డాయి.


వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి 9 గంటల వరకు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగించగా.. టిప్పర్‌, రెండు కార్లు, సుమోను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌ ఆర్టీసీకి చెందిన బస్సును ఇంకా గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు. హరిద్వార్‌కు వెళ్తున్న బస్సులో దాదాపు 22 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఆర్మీ, ఐటీబీపీకి చెందిన బలగాలు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలకు చెందిన 200 మంది జవాన్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.


గురువారం కన్నౌర్‌ జిల్లా కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో హిమాచల్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాదంలో మృతిచెందిన వారికి రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Also Read:

AP Crime: కన్నతల్లి కర్కశత్వం.. 14 రోజుల శిశువును దారుణంగా చంపిన తల్లి.. వాటర్ ట్యాంకులో పడేసి..

Kidnap And Murder Case: రియల్టర్ విజయ్ భాస్కర్‌రెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ప్రముఖ బాబా అరెస్ట్..