Drugs: లెహంగాల్లో దాచి డ్రగ్స్ రవాణా.. కంగుతిన్న నార్కోటిక్స్ బ్యూరో అధికారులు

|

Oct 23, 2021 | 2:05 PM

దేశంలో ఇప్పుడు మత్తుపై యుద్దం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. యువత పెద్ద ఎత్తున మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు.

Drugs: లెహంగాల్లో దాచి డ్రగ్స్ రవాణా.. కంగుతిన్న నార్కోటిక్స్ బ్యూరో అధికారులు
Drugs
Follow us on

దేశంలో ఇప్పుడు మత్తుపై యుద్దం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. యువత పెద్ద ఎత్తున మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. బడాబాబుల పిల్లలు కాస్ట్లీ డ్రగ్స్ తీసుకుటుంటే.. మిడిల్ క్లాస్ యువత చవకగా లభించే గంజాయికి అడిక్ట్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో డ్రగ్స్ పెద్ద ఎత్తున పట్టుబడున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ రవాణాకు పోలీసులు ఫాలో అవుతోన్న మార్గాలు చూసి.. పోలీసులు, నార్కోటిక్స్ బ్యూరో అధికారులు కంగుతింటున్నారు. రోజుకో కొత్త మార్గాన్ని అన్వేశిస్తూ.. స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. సోదాలు చేయడానికి వెళ్లిన అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా బెంగుళూరులో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులు పక్కా సమాచారం ఆధారంగా కోట్ల విలువైన సుమారు 3 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు పంపాల్సిన సరుకును మూడు లెహంగాల్లో దాచి ఉంచారని , ఈ కేసుకు సంబంధించి ఒకరిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. బెంగళూరు జోనల్ డైరెక్టర్ అమిత్ గావఠే టీమ్ అక్టోబర్ 21న అనుమానస్పదంగా ఉన్న పార్శిల్స్ చెక్ చేయగా డ్రగ్స్ దొరికినట్లు వివరించారు. అయితే ఆ పార్శిల్‌పై ఫ్రమ్ అడ్రస్ ఏపీలోని నర్సాపురం అని ఉంది. అయితే పార్శిల్ వచ్చింది మాత్రం చెన్నై నుంచి అని అధికారులు విచారణలో గుర్తించారు. ఈ వివరాలను చెన్నైలోని ఎన్‌సీబీ బృందానికి పంపించారు. వారు రెండు రోజుల పాటు దర్యాప్తు చేసి, పార్శిల్ పంపిన వ్యక్తి అసలు డీటేల్స్ గుర్తించి శుక్రవారం పట్టుకున్నారు. పార్సిల్ పంపడానికి నకిలీ చిరునామాలు, ఫేక్ డాక్యుమెంట్లు వినియోగించినట్లు తెలిపారు.

Also Read: దెయ్యంలా ప్రాంక్ చేయాలనుకుంది.. ప్రాణాలే కోల్పోయింది..

మైకెల్ జాక్సన్ బాతుగా మళ్లీ పుట్టాడా ఏంటి.. మతి పోయేలా స్టెప్పులు, మూన్ వాక్