Viral News: దెయ్యంలా ప్రాంక్ చేయాలనుకుంది… ప్రాణాలే కోల్పోయింది..

ప్రాంక్స్ ఈ మధ్య హద్దుమీరుతున్నాయి. పైత్యం ముదిరి ప్రాణాల మీదకు వస్తుంది. తాజాగా దెయ్యం మాదిరి గెటప్ వేసి.. ప్రాంక్ చేయబోయింది ఓ యువతి.

Viral News: దెయ్యంలా ప్రాంక్ చేయాలనుకుంది... ప్రాణాలే కోల్పోయింది..
Ghost Prank
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 23, 2021 | 2:09 PM

ప్రాంక్స్ ఈ మధ్య హద్దుమీరుతున్నాయి. పైత్యం ముదిరి ప్రాణాల మీదకు వస్తుంది. తాజాగా దెయ్యం మాదిరి గెటప్ వేసి.. ప్రాంక్ చేయబోయిన ఓ యువతి అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయింది. సదరు యువతి తెల్లటి దుస్తులు ధరించి భయానకమైన మేకప్‌తో వీధుల్లో తిరిగింది. ఆమెను చూసి చాలామంది భయపడ్డారు. కానీ ఓ వ్యక్తి మాత్రం భయంతో యువతిపై కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయి మరణించింది. ఈ ఘటన మెక్సికోలోని నౌక్‌చాట్ డి జుయారజ్‌లో చోటుచేసుకుంది. చనిపోయిన యువతి వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలుస్తోంది. ఆ మహిళ లాటిన్ అమెరికాలోని ‘లా లొరోనా’ అని పిలువబడే ఓ భయానక పాత్ర వలె మేకప్ వేసుకుంది. చనిపోయిన బిడ్డల కోసం రోధిస్తున్న మహళలా రోడ్లపై వచ్చిపోయేవారిని భయపెట్టింది. ‘ఏయ్ మిస్ హిజోస్’ అంటే ‘ఓ మై చిల్డ్రన్’ అని గట్టిగా అరుస్తూ ఆమె అక్టోబర్ 15న వీధుల్లో తిరిగిందని స్థానికులు తెలిపారు.  సదరు మహిళకు సంబంధించిన విజువల్స్ కూడా కొందరు రికార్డ్ చేశారు. ఆమెను చూసిన భయపడిన ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు.. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇంతవరకూ ఎలాంటి అరెస్టులు చేయలేదు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

చూశారా.. చిన్న సరదా ఎంత పెద్ద పని చేసిందో. అందుకే అతి ఎప్పుడూ ప్రమాదకరమే అని పెద్దలు అంటారు. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో కూడా పైత్యంతో కూడిన ప్రాంక్స్ చేస్తున్నారు చాలామంది. ఈ ఘటన వారందరికీ ఓ పెద్ద గుణపాఠమే.

Also Read: మైకెల్ జాక్సన్ బాతుగా మళ్లీ పుట్టాడా ఏంటి.. మతి పోయేలా స్టెప్పులు, మూన్ వాక్

 నీటిలో పాముల సయ్యాట.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో