ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై డైరెక్ట్‌గా కారెక్కించాడు.. ఆపకుండా చాలా దూరం ఈడ్చుకెళ్లాడు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవీడియో..
ట్రాఫిక్ ఆంక్షలు అధిగమించి వేగంగా వెళుతున్న ఓ కారును ఆపడానికి ప్రయత్నించిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు చేదు అనుభవం ఎదురైంది.
car directly on the traffic constable: ట్రాఫిక్ ఆంక్షలు అధిగమించి వేగంగా వెళుతున్న ఓ కారును ఆపడానికి ప్రయత్నించిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆ కారు డ్రైవర్ ఏకంగా కానిస్టేబుల్ పైనుంచి కారు నడిపేందుకు ప్రయత్నించగా అతడు ఎగిరి కారు బానెట్‌పై పడ్డాడు. అయినా కారు ఆపకుండా ఆ డ్రైవర్ కానిస్టేబుల్‌ని ఈడ్చుకుంటూ అలాగే వెళ్లాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని నాగపూర్ సిటీ సక్కర్‌ధారాలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ తన విధులను తాను బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నాడు. ఇంతలో ఓ కారు ట్రాఫిక్ ఆంక్షలను అధిగమించి వేగంగా వస్తుండటం గమనించాడు. వెంటనే ఆ కారును ఆపడానికి ప్రయత్నించాడు. అయితే ఆ కారు డ్రైవర్ కానిస్టేబుల్ నుంచి తప్పించుకోవాలని చూశాడు. అందుకోసం కానిస్టేబుల్ పైనుంచి కారు నడిపేందుకు ప్రయత్నించగా అతడు ఎగిరి కారు బానెట్‌పై పడ్డాడు. అయినా ఆ డ్రైవర్ కారు ఆపకుండా చాలాదూరం కానిస్టేబుల్‌ను అలాగే ఈడ్చుకెళ్లాడు. అంతేకాకుండా ఎదురుగా వస్తున్న ఓ బైకర్‌ను ఢీ కొట్టాడు. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే పోలీస్ హెడ్ క్వాటర్స్ నుంచి గమనించిన పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకొని కారును వెంబడించి ఆ డ్రైవర్‌ను పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఆ కారును కూడా సీజ్ చేశారు. అదృష్టం కొద్ది ఆ కానిస్టేబుల్‌కు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నరు. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#WATCH | Nagpur: An on-duty Traffic Police personnel was dragged on the bonnet of a car in Sakkardara area after he attempted to stop the vehicle, yesterday. The driver of the vehicle has been arrested. #Maharashtra
(Video Courtesy: Nagpur Police) pic.twitter.com/uZjB6JnYSB
— ANI (@ANI) November 30, 2020