AP News: ఏపీలో నకిలీ థైరాయిడ్ మందుల కలకలం.. అనుమానం రాకుండా దందా.. చివరకు

|

Mar 16, 2022 | 1:12 PM

Thyroid Drugs: మెడికల్ రిప్రజంటేటివ్ పనిచేశాడు. ఆ అనుభవంతో ఏ మెడిసిన్‌కు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుందో బాగా అర్ధం చేసుకున్నాడు. అప్పటి నుంచి థైరాయిడ్ నకిలీ మందులు తయారు చేయడం మొదలు పెట్టాడు.

AP News: ఏపీలో నకిలీ థైరాయిడ్ మందుల కలకలం.. అనుమానం రాకుండా దందా.. చివరకు
Drugs
Follow us on

Thyroid Drugs: మెడికల్ రిప్రజంటేటివ్ పనిచేశాడు. ఆ అనుభవంతో ఏ మెడిసిన్‌కు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుందో బాగా అర్ధం చేసుకున్నాడు. అప్పటి నుంచి థైరాయిడ్ నకిలీ మందులు తయారు చేయడం మొదలు పెట్టాడు. అయితే నర్సరావుపేటలో విక్రయించే థైరాయిడ్ ట్లాబెట్స్ నకిలివి ఉన్నాయన్న సమాచారంతో ఏపి డ్రగ్ కంట్రోల్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ టాబ్లెట్స్ సేకరించి పరీక్షలకు ల్యాబ్‌కు పంపారు. అక్కడ ఈ మందులను పరీక్షించిన నిపుణులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వాటిల్లో అసలు థైరోనారమ్ మందే లేదని తేలింది. దీంతో నర్సరావుపేటలోని డిస్ట్రిబ్యూటర్ నుండి ఆ మందులు వెనక్కి తీసుకున్నారు. అవి ఎక్కడ నుంచి కొనుగోలు చేశారో ఆ డిస్ట్రిబ్యూటర్ వద్ద సమాచారం తీసుకున్నారు. దర్యాప్తు చేసిన అధికారులకు కర్నాటకలోని హుబ్లీలో ఒక వ్యక్తి ఈ మందులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

అనంతరం హుబ్లీకి చెందిన జైయేష్ కుమార్‌పై అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అతని వద్ద నకిలీ గుర్తింపు కార్డులు, లెటర్ హెడ్స్ స్వాధీనం చేసుకున్నారు. థైరాయిడ్ మందులు నకిలీవి తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అతన్ని పట్టుకొని అతని వద్ద నుంచి మూడు లక్షల రూపాయల విలువ చేసే నకిలీ టాబ్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. కర్నాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఆ ట్యాబ్లెట్లను ఎగుమతి చేసినట్లు గుర్తించారు.

కాగా.. గుంటూరు, కృష్ణా జిల్లాలో ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగి ఎక్కడెక్కడ వాటిని విక్రయించారో గుర్తించి వెనక్కి తెప్పిస్తున్నారు. వీటిని అసలు గుర్తించకుండా అన్ని చర్యలు తీసుకొని తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. చివరికి హోల్ గ్రామ్ కూడా మందుల పెట్టలపై ఉన్నట్లు అధికారులు తనిఖీ సమయంలో కనుగొన్నారు.

ఇంత పకడ్బందిగా నకిలీ మందులు తయారు చేడయం ఒక్కడి వల్లనే సాధ్యం కాదని.. దీని వెనుక మాఫియా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రాధమికంగా నిందితుడిని అరెస్ట్ చేసిన అధికారులు ఈ వ్యవహారంపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

-టి నాగరాజు, టివి9 తెలుగు రిపోర్టర్, గుంటూరు.

Also Read:

Superfoods: పురుషులను శక్తివంతులుగా మార్చే సూపర్ ఫుడ్స్.. అవేంటో తప్పనిసరిగా తెలుసుకోండి..