Jayashankar Bhupalpally: తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో నీట మునగి తాతా, మనవడు మరణించారు. ముందుగా చెరులో మనవడు పడిపోగా.. అతణ్ణి కాపాడబోయి తాత కూడా మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాల్లోని మహా ముత్తరాం మండలం బోర్లగూడెం నర్సింగాపూర్ శివారులో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మృతులు భీముని భూమయ్య (58), భీముని రిషీ (10) నర్సింగాపూర్‌కు వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో చెరువు వెనుక ఉన్న వారి పొలానికి వెళ్తూ నీటిలో నుంచి చెరువు దాటే ప్రయత్నం చేశారు. మనవడు ఒక్కసారిగా నీటిలో మునిగిపోయాడు. దీంతో అతన్ని కాపాడే ప్రయత్నంలో భూమయ్య కూడా నీటమునిగి మృత్యువాత పడ్డాడు.
కాగా.. చెరువు మరమ్మతు పనుల్లో భాగంగా గత నెలలో జేసీబీలతో మట్టిని తవ్వారు. దీంతో లోతైన గుంతలు ఏర్పడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు. నిత్యం అదే చెరువులో చేపలు పడుతూ భూమయ్య.. గత 25 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నాడు. చెరువు కట్టపైనే మంచెవేసుకుని అక్కడే ఉండేవాడు. అదే చెరువులో నీటిలో భూమయ్య మునిగి మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భూమయ్య కొడుకు రవి గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇప్పుడు భూమయ్యతోపాటు అతని మనవడు కూడా మరణించాడు.
Also Read;