నిజామాబాద్‌ జిల్లా ధర్యాపూర్‌లో దేవతా విగ్రహాల ధ్వంసం.. ఆగ్రహిస్తున్న గ్రామస్థులు.. నిందితులను పట్టుకోవాలని డిమాండ్..

God Idols Destruction : ఆంధ్రప్రదేశ్‌లో కొంత కాలంగా దేవతా విగ్రహాల ధ్వంసం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు కొనసాగుతున్నాయి..

నిజామాబాద్‌ జిల్లా ధర్యాపూర్‌లో దేవతా విగ్రహాల ధ్వంసం..   ఆగ్రహిస్తున్న గ్రామస్థులు.. నిందితులను పట్టుకోవాలని డిమాండ్..

Updated on: Mar 09, 2021 | 3:36 PM

God Idols Destruction : ఆంధ్రప్రదేశ్‌లో కొంత కాలంగా దేవతా విగ్రహాల ధ్వంసం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు కూడా  కొనసాగుతున్నాయి.. ఇప్పుడు ఆ దేవతా విగ్రహాల ధ్వంసం తెలంగాణకు ఇటీవల హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి మూసాపేట్ సర్దార్‌నగర్‌లోని దుర్గామాత ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న జంట నాగుల విగ్రహాన్ని సైతం ముక్కలు చేశారు. దీంతో.. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు ఆలయం ముందు ఆందోళనకు కూడా  దిగారు. ఆలయం ఆవరణలో ఓ కుక్కను కూడా వేలాడదీసి హత్య చేసినట్లు ఆనవాళ్లు కూడా కనిపించాయి.  ఈ ఘటన మరువక ముందే తాజాగా నిజమాబాద్ జిల్లాలో మరో ఆలయంపై దాడి చేశారు.

నవీపేట మండలం ధర్యాపూర్ మహాలక్ష్మి మందిరంలోని చిలుకమ్మ, మంగమ్మ విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆలయ ఆలయ అధికారులు, బాధ్యులు పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే విగ్రహాల ధ్వంసంపై గ్రామస్థులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నిందితులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు.  ఈ విషయంపై రాజకీయ నేతలు దృష్టి సారించి ధ్వసంమైన విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించాలని కోరారు.

 

Police Arrested BJP Leaders : కామారెడ్డి జిల్లా భిక్కనూరులో ఉద్రిక్తత.. బీజేపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు..

ఇండియాలో సెహ్వాగ్ తర్వాత మళ్లీ ఇతడే.. తన క్రికెట్ జీవితంలో ఇలాంటి ఆటగాడిని చూడలేదంటున్న పాకిస్తాన్ మాజీ సారథి..

Karnataka Crime : కర్ణాటకలో దారుణం.. అనుమానంతో భార్యను ముక్కలు ముక్కలుగా నరికిచంపిన భర్త.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..

Dharani website : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. మీ పట్టా పాస్ బుక్‌లో తప్పులున్నాయా..? అయితే ఇలా సవరించుకోండి..