Girl raped by father: కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ తండ్రి కామాంధుడయ్యాడు. అభం శుభం తెలియని కన్న కూతురిపై (మైనర్ బాలిక) కన్నేసి తన కామ వాంఛలు తీర్చుకున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే అంతు చూస్తా అంటూ బెదిరించాడు. మౌనంగా ఈ అమానుషాన్ని భరించిన ఆ చిన్నారి చివరకు బాలిక గర్భం దాల్చింది. దీంతో ఈ అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన ఏపీలోని అనంతనపురం జిల్లాలోని గుంతకల్లులో జరిగింది. పెయింటర్‌గా పనిచేస్తూ తాగుడుకు బానిసైన ఓ వ్యక్తికి ఇద్దు కుమార్తెలున్నారు. ఈ క్రమంలో 15ఏళ్ల పెద్ద కుమార్తెను బెదిరించి అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపుతానంటూ బెదిరించాడు. దీంతో ఆ చిన్నారి ఎవరికీ చెప్పలేదు.
ఈ క్రమంలో కూతురికి నలతగా ఉండటంతో తల్లి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆ చిన్నారిని పరీక్షించిన వైద్యులు గర్భవతి అని నిర్ధారణ చెప్పారు. అనంతరం కూతురిని నిలదీయడంతో జరిగిన విషయం గురించి చెప్పింది. ఈ దారుణం గురించి విన్న తల్లి ఎం చేయాలో పాలుపోక అబార్షన్ చేయాలని వైద్యులను కోరినట్టు సమచారం. అందుకు వైద్యులు సమ్మతించలేదు. పోలీసులకు సమాచారం ఇస్తామని తెలపడంతో వారు భయపడి ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయారు.
అనంతరం బుధవారం తల్లి బాలికను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించింది. అక్కడ కూడా గర్భవతి అని నిర్ధారణ కావడంతో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. తల్లి, బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడిపై గుంతకల్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు.
Also Read: