Girl commits suicide: పెళ్లి అయినప్పటికీ ఓ యువకుడు.. ప్రేమ పేరుతో బాలికను నమ్మించాడు.. అది తెలిసిన ఆ మైనర్ బాలిక.. సదరు యువకుడికి దూరంగా ఉంది. అయినప్పటికీ.. యువకుడు వెంటపడి వేధిస్తుండటంతో చివరికి ఆ బాలిక (17) బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద సంఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఖమ్మం నగరంలోని ప్రముఖ ప్రైవేటు హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తున్న ఓ బాలిక.. నగరంలోని ఒక హాస్టల్‌లో సోమవారం తెల్లవారుజామున స్టెరాయిడ్స్ ఎక్కించుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తల్లడకు చెందిన ఓ పదిహేడేళ్ల బాలిక ఇంటర్ పూర్తి చేసి స్థానికంగా ఉన్న ఓ ప్రెవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో అక్కడ పని చేస్తున్న మధు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మధు మాయమాటలతో ఆ బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకొని కొంత కాలం తరువాత వేధించడం మొదలు పెట్టాడు. దీంతోపాటు ఆ బాలిక నుంచి డబ్బులు కూడా తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలోనే ఆ బాలిక ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా జాయిన్ అయింది. నగరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం చేస్తోంది. అయితే నిందితుడు.. అంతకుముందు ఆ దిగిన ఫోటోలు పంపిస్తూ బాలికను వేధించడం మొదలు పెట్టాడు. అయితే.. వేధింపులు ఎక్కువ కావడంతో చివరకు ఆ బాలిక మనస్తాపం చెంది.. ఆదివారం రాత్రి స్టెరాయిడ్స్ తీసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. తల్లి దండ్రులు ఫిర్యాదు మేరకు మధు అనే వ్యక్తిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. యువతి మరణానికి కారణమైన మధును కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నాయకులు, కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.
Also Read: