Murder: ఆస్తి కోసం 20 ఏళ్ల నుంచి ఒకరి తర్వాత ఒకరిని హత్య చేశాడు.. వారందరూ కుటుంబ సభ్యులే..!

|

Sep 26, 2021 | 10:19 PM

ఆస్తి కోసం ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఒకటి కాదు రెండు కాదు 20 సంవత్సరాల నుంచి ఒకరి తర్వాత ఒకరిని చంపుతూ ఆస్తి దక్కించుకోవాలని ప్రయత్నం చేశాడు. చివరికి జైలు పాలయ్యాడు.

Murder: ఆస్తి కోసం 20 ఏళ్ల నుంచి ఒకరి తర్వాత ఒకరిని హత్య చేశాడు.. వారందరూ కుటుంబ సభ్యులే..!
Crime Record
Follow us on

ఆస్తి కోసం ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఒకటి కాదు రెండు కాదు 20 సంవత్సరాల నుంచి ఒకరి తర్వాత ఒకరిని చంపుతూ ఆస్తి దక్కించుకోవాలని ప్రయత్నం చేశాడు. చివరికి జైలు పాలయ్యాడు. ఈ ఘటన ఉత్తర్‎ప్రదేశ్‎లోని ఘజియాబాద్‎లో‎ జరిగింది. ఘజియాబాద్‎లోని మురద్ నగర్‎కు లీలు త్యాగి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని బంధువు అదృశ్యం కేసులో ఫిర్యాదు రావటంతో లీలు త్యాగిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని విచారించిన పోలీసులకు కళ్లు బైర్లు కమ్మే నిజాలు చెప్పాడు లీలు త్యాగి. ఆస్తి కోసం తన సోదరులు, సోదురుల కుమారులు, కుమార్తెలను చంపినట్లు చెప్పాడు.

దాదాపు 20 సంవత్సరాల క్రితం.. లీలు త్యాగి తన అన్న సుధీర్ త్యాగిని హత్య చేశాడు. తర్వాత సుధీర్ త్యాగి ఎనిమిదేళ్ల కుమార్తెకు విషం ఇచ్చి చంపాడు. కొద్ది సంవత్సరాల తర్వాత సుధీర్ త్యాగి రెండో కుమార్తెను హత్య చేసి ఆమె మృతదేహాన్ని చెరువులో పడేశాడు. 2012లో.. లీలు త్యాగి తన రెండో సోదరుడు బ్రిజేష్ కుమారుడిని చంపి, అతని శవాన్ని ఘజియాబాద్‎లోని ఓ ప్రదేశంలో పడేశాడు. ఈ సంవత్సరం ఆగస్టులో లీలు త్యాగి.. అతని సహచరులు సురేంద్ర త్యాగి, రాహుల్‎తో కలిసి బ్రిజేష్ రెండో కుమారుడు రేషును చంపడానికి ప్రణాళిక వేశాడు. ఆగస్టు 8న లీలు త్యాగి రేషును పార్టీకి రావాలని కోరాడు. ఇది నమ్మిన రేషు లీలు త్యాగి వద్దకు వెళ్లాడు. అక్కడ తిని తాగిన తర్వాత రేషను తాడుతో గొంతుకు ఉరేసి హత్య చేశారు. రేషు మృతదేహాన్ని బులంద్‎షహర్‎లోని కాలువ వద్ద పడేశారు.

రేషు అద్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో లీలు త్యాగి, అతని అనుచరులు సురేంద్ర త్యాగి, రాహుల్ అరెస్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లీలు మృతదేహాలను నదిలో లేదా కాలువలో పడేసినందున అతని కుటుంబ సభ్యులు అతడిని ఎన్నడూ అనుమానించలేదని తెలుస్తోంది. లీలు త్యాగి గత కొన్నేళ్లుగా ఎవరు లేని తన పెద్ద అన్నయ్యతో ఉంటున్నారు. అతని ఆస్తిని తన పేరు మీద రాయించుకున్నాడు కూడా.

మరిన్ని చదవండి ఇక్కడ : Divorce Party Video: విడాకుల సందర్భంగా గ్రాండ్‌ పార్టీ.. విముక్తి లభించిందంటున్న మహిళ..(వీడియో)

 Warangal Medical College: తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్‌..! రాష్టంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలు..(వీడియో)

 Lion and Tortoise video: నీళ్లు తాగడానికి వచ్చిన సింహం.. చుక్కలు చూపించిన తాబేలు..!(వీడియో)

 YSRCP Leaders Vs Pawan Kalyan: పవర్ స్టార్‌పై పంచుల యుద్ధం.. ఈ వివాదం ఏపీ ప్రభుత్వం vs తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీగా మారుతుందా..?(వీడియో)