Gang Clash In Prison: జైలులో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 24 మంది ఖైదీలు మరణించారు. దీంతోపాటు 48 మంది ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటన ఈక్వెడార్ దేశంలోని గ్వయాస్ ప్రావిన్స్‌లోని పెనిటెన్షియారియా డెల్ లిటోరల్‌లోని జైలులో జరిగింది. సోమవారం రెండు గ్యాంగుల మధ్య చెలరేగిన వివాదం హింసాత్మకంగా మారినట్లు ఈక్వేడార్ అధికారులు మంగళవారం తెలిపారు. అనంతరం రెండు వర్గాల ఖైదీలు బాంబులు, తుపాకులతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో 24 మంది ఖైదీలు మృతిచెందారు. మరో 48 మందికిపైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.
అనంతరం రంగంలోకి దిగిన సైనికులు, పోలీసులు అల్లర్లను అదుపుచేశారు. ఈ ఘర్షణలను అదుపు చేయడానికి భద్రతా సిబ్బంది 5 గంటల పాటు శ్రమించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈక్వెడార్‌లోని మూడు జైళ్లలో 39వేల మంది ఖైదీలు ఉన్నారు. తరచూ ఈ జైళ్లల్లో ఘర్షణలు జరుతాయి. గత ఫిబ్రవరిలో జరిగిన ఘర్షనల్లో 79 మంది మరణించారు. జూలైలో జరిగిన మరో ఘటనలో 22 మంది ఖైదీలు మృతిచెందారు.
కాగా.. ఈ హింసాత్మక ఘటనపై ఇంటర్-అమెరికన్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ (IACHR) ఆందోళన వ్యక్తంచేసింది. జైలు హింసపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు ఈక్వెడార్ ప్రభుత్వాన్ని కోరారు.
Also Read: