Four Policemen Suspended: అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న పోలీసులపై వేటు.. ఇద్దరు మహిళలతో పాటు నలుగురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్

|

Jun 17, 2021 | 2:29 PM

కామారెడ్డి జిల్లాలోని బీచ్కుంద పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఇందులో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉండటం విశేషం.

Four Policemen Suspended: అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న పోలీసులపై వేటు.. ఇద్దరు మహిళలతో పాటు నలుగురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
Follow us on

Four Policemen including Two Lady Constables Suspended: మగువలు అన్నింటిలోనూ సగ భాగం అన్నట్లు.. కరప్షన్‌లోనూ తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలోని బీచ్కుంద పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఇందులో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉండటం విశేషం. బీచ్కుంద పోలీసు స్టేషన్‌ పరిధిలోని చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న నలుగురు పోలీసు కానేస్టేబుళ్లపై ఆరోపణలు వచ్చాయి. ఇసుక లారీల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు వీరిపై ఆరోపణలు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. ఆరోపణలు రుజువుకావడంతో ఎస్పీ శ్వేతారెడ్డి నలుగురిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్టేష‌న్ సిబ్బంది మంజీర న‌ది నుంచి లారీలు, ట్రాక్టర్లలో ఇసుక‌ను త‌ర‌లిస్తున్న వారి నుంచి డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారని జిల్లా ఎప్పీ కి ఫిర్యాదు వ‌చ్చింది. ఇసుక త‌ర‌లిస్తున్న లారీ నుంచి అక్రమంగా ఆపి.. డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నార‌ని నలుగురు కానిస్టేబుళ్లపై జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి దర్యాప్తునకు ఆదేశించారు. దీంతో నలుగురు పోలీసుల కానిస్టేబుళ్ల అక్రమ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో నలుగరిని విధులను తప్పిస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ కు గురైన వారిలో సంతోష్, ప‌రందామ‌య్య, సీహెచ్ ప్రతిభ‌, మైతక‌ళలు ఉన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని ఎస్పీ తెలిపారు. అవినీతికి పాల్పడుతూ మహిళా కానిస్టేబుళ్లు స‌స్పెండ్ కావ‌డం జిల్లాలో ఇదే మొద‌టి సారి. అయితే, వీరితో పాటు జిల్లాలో యథేచ్చగా సాగుతున్న అక్రమ ఇసుక దందాకు పోలీసులు వంత పాడుతున్నారన్న జిల్లావాసులు ఆరోపిస్తున్నారు.

Read Also….. 

Disabled Dancer: ఆత్మస్థైర్యం ఉంటే అంగవైకల్యం ఓ లెక్కా అంటున్న ఓ యువతి..ఒంటి కాలితో సూపర్ హిట్ సాంగ్ కు డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా

Aadhaar Update: ఆధార్‌ కార్డులో పేరు, ఇతర వివరాలు మార్చాలనుకుంటే ఎలాంటి డాక్యుమెంట్లు కావాలి..?