Napal Road Accident: నేపాల్‌లోని రౌతహత్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయులు దుర్మరణం
నేపాల్‌లోని రౌతహత్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటన నలుగురు భారతీయులు దుర్మరణం పాలయ్యారు.
Napal Road Accident: నేపాల్‌లోని రౌతహత్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటన నలుగురు భారతీయులు దుర్మరణం పాలయ్యారు. భారత్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఓ వాహనం అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు భారతీయులు మరణించారు. ఈ మేరకు ఆదివారం మీడియా కథనాల ద్వారా వెల్లడించారు. డ్రైవరుతో సహా వాహనంలో ఉన్న ఇతర వ్యక్తులు మద్యం తాగి ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మృతులంతా బీహార్‌కు చెందిన దీనానాథ్ సాహ్ (25), అరుణ్ సాహ్ (30), దిలీప్ మహ్తో (28), అమిత్ మహ్తో (27)గా గుర్తించారు.
యమునామై రూరల్ మునిసిపాలిటీలోని గౌర్ చంద్రాపూర్ రోడ్ సెక్షన్‌లో డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోయాడని రౌతహత్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ బినోద్ ఘిమిరే చెప్పారు. ఆ తర్వాత కారు అదుపుతప్పి చెరువులో పడిపోయింది. భద్రతా సిబ్బంది వారిని రక్షించేందుకు ప్రయత్నించారని చెప్పారు. అయితే, అప్పటికే వారు ప్రాణాలను కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, వారి వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా బాధితులను గుర్తించారు. రౌతత్ పోలీసులు భారత పోలీసులను సంప్రదించారు. ఆదివారం ఉదయం మృతుడి బంధువులు వచ్చి గుర్తింపును ధృవీకరించారని ఘిమిరే తెలిపారు. క్రేన్ సాయంతో చెరువులో నుంచి వాహనాన్ని బయటకు తీశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
అంతకుముందు, నేపాల్‌లోని ముగు జిల్లాలో అక్టోబర్ 12 న జరిగిన బస్సు ప్రమాదంలో కనీసం 28 మంది మరణించారు.16 మంది గాయపడ్డారు. అలాగే, గండకి ప్రావిన్స్‌లోని కస్కీ జిల్లాలోని గాండ్రుక్‌లో సోమవారం జరిగిన జీపు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు, దీని కారణంగా చాలా ఎత్తు నుండి కొండగాలిలో నదిలో పడిపోయింది. అయితే, నేపాల్ ప్రాంతం ఎత్తైన కొండలు, గుట్టలతో, మలుపులతో కూడి ఉండటం కారణంగా తరుచుగా భారీ ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.