Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా నలుగురు మృతి

UP Accident: హోలీ పర్వదినం నాడు దేశవ్యాప్తంగా రహదారులు రక్తసిక్తమయ్యాయి. చాలా చోట్ల జరిగిన రోడ్డు

Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా నలుగురు మృతి
Road Accident

Updated on: Mar 30, 2021 | 12:53 AM

UP Accident: హోలీ పర్వదినం నాడు దేశవ్యాప్తంగా రహదారులు రక్తసిక్తమయ్యాయి. చాలా చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో సైతం సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు-పికప్ వాహనం ఢీకొని చిన్నారితో సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన బులంద్‌షహర్ జిల్లా దరియాపూర్‌లోని ఐపీ కళాశాల సమీపంలో చోటు చేసుకుంది. కళాశాల వద్ద పికప్‌ వాహనం యూటర్న్‌ తీసుకుంటుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని బులంద్‌షహర్ పోలీసులు వెల్లడించారు.

సమచారం అందుకున్న కలెక్టర్‌, ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. మరో 8 మంది పరిస్థితి విషమం..