Holi Celebration: ఇంటి ముందు హోలీ వద్దన్నందుకు.. వృద్ధురాలిని కొట్టి చంపారు.. ఎక్కడంటే..?
Woman Beaten: హోలీ ఇంటి ముందు జరుపుకోవద్దన్న ఓ వృద్ధురాపై కొందరు దాడి చేసి అతి కిరాతకంగా కొట్టి చంపారు. దీంతోపాటు ఆమె
Woman Beaten: హోలీ ఇంటి ముందు జరుపుకోవద్దన్న ఓ వృద్ధురాపై కొందరు దాడి చేసి అతి కిరాతకంగా కొట్టి చంపారు. దీంతోపాటు ఆమె కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. ఇటావా జిల్లాలోని మేవటిలోని తోలా ప్రాంతంలో ఒక ఇంటి ముందు కొందరు హోలీ జరుపుకున్నారు. ఈ క్రమంలో ఆ ఇంటికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆగ్రహం చెందిన కొందరు వ్యక్తులు ఆ ఇంట్లోకి చొరబడి మృద్ధురాలిపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించిందని పోలీసులు తెలిపారు.
ఆమెను కాపాడబోయిన కుటుంబ సభ్యులను కూడా దుండగులు కొట్టారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఆ వృద్ధురాలు చనిపోగా ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలు గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన సోమవారం ఉదయం 10గంటల ప్రాంతంలో జరిగిందని.. నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నామని అదనపు పోలీసు సూపరింటెండెంట్ ప్రశాంత్ కుమార్ ప్రసాద్ తెలిపారు.
Also Read: