AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ తెరపైకి నయీం కేసు.. క్లీన్‌ చీట్‌ ఇవ్వడాన్ని తప్పుపడుతున్న ఫోరంఫర్‌ గుడ్‌ గవర్నెన్స్..సీబీఐతో విచారణకు డిమాండ్

Gangster Naeem:నయీమ్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు. సిట్‌ దర్యాప్తులో ఏం తేల్చకపోవడాన్ని తప్పుపడుతున్న...

మళ్లీ తెరపైకి నయీం కేసు.. క్లీన్‌ చీట్‌ ఇవ్వడాన్ని తప్పుపడుతున్న ఫోరంఫర్‌ గుడ్‌ గవర్నెన్స్..సీబీఐతో విచారణకు డిమాండ్
Sanjay Kasula
|

Updated on: Mar 09, 2021 | 1:54 AM

Share

Gangster Naeem Case: నయీమ్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు. సిట్‌ దర్యాప్తులో ఏం తేల్చకపోవడాన్ని తప్పుపడుతున్న ఆ సంస్థ.. సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతున్నారు.

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నాలుగు పేజీలతో ఓ లేఖ రాశారు. ఈ లేఖలో.. నయీం చేసిన అరాచకాలు, అతనితో ఇతరులకు ఉన్న సంబంధాలు, సిట్‌ దర్యాప్తును విడమర్చారు. సీబీఐ విచారణ జరిపిస్తేనే నిజానిజాలు బయటకు వస్తాయని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ నమ్ముతోంది.

సమగ్ర విచారణ కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌.. వివిధ కారణాలతో కేసును పక్కదారి పట్టించిందని తెలిపింది. దోషులను కాపాడే ఉద్దేశంతోనే ఇలా చేస్తోందని చెప్పింది. నయీంకు తెలంగాణలోనే కాదు.. ఏపీ, ఛత్తీస్‌గడ్‌, గోవా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలోనూ ఆస్తులున్నాయని తెలిపిన ఆ సంస్థ కార్యదర్శి పద్మనాభరెడ్డి..

ఇక్కడి పోలీసులతో ఆయా రాష్ట్రాల్లో విచారణ చేపట్టడం అంత సులువు కాదన్నారు. నయీంకు పోలీసులతోనే కాదు.. రాజకీయ నేతలతోనూ సత్సంబంధాలున్నాయని, ఆ అదునుతోనే అసాంఘిక శక్తులను వెంట వేసుకుని నేర సామ్రాజ్యాన్ని విస్తరించారని అన్నారు. సుమారు రెండు దశాబ్దాల పాటు నయీం అరాచాలు సాగాయన్నారు.

హత్యలు, భూములను బలవంతంగా లాక్కోవడం, బెదిరింపులకు దిగడం వంటివి చేశాడన్నారు. సోదాల్లో 24 తుపాకులు దొరకగా.. 130 డైరీలు, 602 సెల్‌ఫోన్లు, 752 భూ దస్తావేజులతో పాటు 2 కోట్లకుపైగా నగదును కూడా స్వాధీనం చేసుకున్నారన్నారు.

అంటే ఏ స్థాయిలో నయీం అక్రమాలకు పాల్పడ్డారో తెలుస్తోందన్న పద్మనాభరెడ్డి.. మొత్తం లోతుగా దర్యాప్తు చేస్తే అతనితో అంటకాగిన వారి బాగోతాలు కూడా బయటకు వస్తాయన్నారు. నయీం అనుచరులపై 200పైగా కేసులు నమోదు చేసిన సిట్‌.. పోలీసుల ప్రమేయం లేదని క్లీన్‌ చిట్‌ ఇవ్వడాన్ని ఫోరంఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ తప్పుపట్టింది. అసలుదోషులను శిక్షించేలా చూడాలని అందుకోసం సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్