Hyderabad Gangrape Case: హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ పరిధిలో పబ్‌కు వెళ్లిన యువతి (17)పై కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. సంచలనంగా మారిన ఈ రేప్ కేసులో అరెస్టులు మొదలయ్యాయి. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇద్దరిలో వక్ఫ్‌బోర్డు చైర్మన్ మసీవుల్లాఖాన్ కొడుకు, ఆయన ఫ్రెండ్ ఒకతను అని అన్నారు. ఈ ఘటన మే 28న జరుగగా, మే 31న లైంగిక దాడి జరిగిందని బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు చేపట్టామని, తనపై అఘాయిత్యానికి పాల్పడింది ఎవరో బాధితురాలు చెప్పలేకపోయిందని, ఒక్కరి పేరు మాత్రమే ఆమె చెప్పగలిగిందని అన్నారు.
సీసీపుటేజీ, టెక్నికల్ ఆధారాలను సేకరించాం. బాధితురాలు చెప్పిన విషయాన్ని, ఆధారాలను క్రాస్ చెక్ చేస్తున్నామని డీసీపీ అన్నారు. తమ విచారణలో ఐదుగురు నిందితులను గుర్తించామని పేర్కొన్నారు. నిందితుల్లో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నారు. బాలిక వాంగ్మూలం తర్వాత సెక్షన్లు మార్చాం అని అన్నారు. ఈ కేసులో హోంమంత్రి మనవడు ఉన్నాడని మధ్యాహ్నం ఆరోపణలు వచ్చాయి.. నూరుశాతం ఈ కేసులో హోంమంత్రి మనవడు లేడు అని వెల్లడించారు.
పబ్‌కు మైనర్ బాలికను తీసుకొచ్చింది హాదీ అంటూ పేర్కొన్నారు.. హోంమంత్రి మనవడు పుర్ఖాన్‌కు పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. సీసీపుటేజీ విశ్లేషణలో ఎక్కడా అతను లేరని, సంబంధం లేకుండా అతని పేరుతో ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే కొడుకుపైనా ఇప్పటి వరకూ అయితే ఎలాంటి ఆధారాలు లేవు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి