చేపల కూర కోసం ప్రాణ స్నేహితుడినే చంపేశాడు.. మంచం కోడుతో కొట్టి మాయం చేశాడు.. చివరకు ఇలా దొరికిపోయాడు..

|

Jan 24, 2021 | 11:40 AM

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. చేపల కూరకోసం స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణాలు తీసేవరకు వెళ్లింది.

చేపల కూర కోసం ప్రాణ స్నేహితుడినే చంపేశాడు.. మంచం కోడుతో కొట్టి మాయం చేశాడు.. చివరకు ఇలా దొరికిపోయాడు..
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. చేపల కూరకోసం స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణాలు తీసేవరకు వెళ్లింది. స్థానికంగా కలకలం రేపిన ఘటన సారవకోట మండలంలోని బుడితి సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కాకినాడకు చెందిన గంటా పాండురంగారావు బుడితి సమీపంలో జరుగుతున్న రక్షిత మంచినీటి పథకం ట్యాంకు నిర్మాణ పనుల కోసం మూడు నెలల క్రితం వచ్చి అవలింగిలో అద్దెకు ఇల్లు తీసుకుని ఉంటున్నాడు. ఇటీవల సంక్రాంతి పండుగ కోసం స్వగ్రామానికి వెళ్లిన ఆయన తనకు పరిచయం ఉన్న తూర్పుగోదావరి జిల్లా కట్టమూరు గ్రామానికి చెందిన పాలమూరి ప్రసాద్‌ (60)ని తనతో పాటు ఈ నెల 21వ తేదీన అవలంగి గ్రామానికి తీసుకొనివచ్చాడు. వీరిద్దరూ స్థానికంగా ఉంటున్న మరో ఇద్దరుతో కలిసి ఆదేరోజు రాత్రి చేపల కూర చేసుకుని మద్యం తెచ్చుకుని పూటుగా తాగారు.

ఇక్కడి వరకు బాగానే ఉన్నా చేపల కూర విషయంలో పాండురంగారావు, ప్రసాద్‌ మధ్య గొడవ తలెత్తింది. దీంతో సహనం కోల్పోయిన పాండురంగారావు మంచం కోడుతో ప్రసాద్‌ తల, చేతులపై కొట్టడంతో మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని స్థానికుల సహాయంలో చెత్త సేకరణ బండిలో తీసుకొనివెళ్లి సమీపంలో ఉన్న చెరువు గట్టుపై పాతి పెట్టారు. విషయం గ్రామస్తులకు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పాతి పెట్టిన మృత దేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం పంపించారు. ఈ ఘటనలో పాల్గొన్న నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించారు.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి గ్రేట్ కాంబినేషన్‌లో సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా..