Kurnool: న్యాయం కావాలంటూ పాతిపెట్టిన కూతురు మృతదేహాన్ని వెలికితీయాలన్న తండ్రి.. అడ్డుకున్న పోలీసులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

|

Feb 15, 2022 | 6:40 PM

యువకుడి వేధింపుల వల్లే తన కూతురు కన్నుమూసిందంటూ న్యాయ జరగాలంటూ చనిపోయిన కూతురు మృతదేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నించాడు ఓ తండ్రి.

Kurnool: న్యాయం కావాలంటూ  పాతిపెట్టిన కూతురు మృతదేహాన్ని వెలికితీయాలన్న తండ్రి.. అడ్డుకున్న పోలీసులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Follow us on

యువకుడి వేధింపుల వల్లే తన కూతురు కన్నుమూసిందంటూ న్యాయ జరగాలంటూ చనిపోయిన కూతురు మృతదేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నించాడు ఓ తండ్రి. అయితే ఇది చట్టవిరుద్ధమంటూ పోలీసులు అతని ప్రయత్నా్న్ని అడ్డుకున్నారు. కర్నూలు (Kurnool) జిల్లా డోన్‌ (Dhone) మండలం ఉడుముల పాడులో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. ఉడుముల పాడుకు చెందిన ఓబులేసు కుమార్తె శ్రావణి (Sravani) ఐదురోజుల క్రితం అనుమానాస్పదంగా మృతిచెందింది. కర్నూలులోని ఓ మెడికల్‌ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు చేస్తోన్న ఆయువతి అనారోగ్యంతో చనిపోయిందని స్థానికులు భావించారు.

యువకుడి వేధింపుల వల్లే..

అయితే శ్రావణి అనారోగ్యంతో చనిపోలేదని ఓ యువకుడి ప్రేమ వేధింపుల వల్లే కన్నుమూసిందంటున్నాడు ఆ యువతి తండ్రి. అంతేకాదు చనిపోయిన తన కూతురుకు న్యాయం జరగాలంటున్నాడు. ఇందుకోసం ఐదు రోజుల క్రితం పాతిపెట్టిన కూతురు మృతదేహాన్ని వెలికితీసి ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్మశానానికి వెళ్లాడు. కాగా ఈ విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు చేరవేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఓబులేసు ప్రయత్నా్న్ని అడ్డుకున్నారు. పాతిపెట్టిన మృతదేహాలను వెలికితీయడం చట్టవిరుద్దమంటూ అతడిని వారించారు. అయినా అతను వినలేదు. చివరకు గ్రామపెద్దలు జోక్యం చేసుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వెనక్కు తగ్గాడు. కాగా ఓబులేసు ఫిర్యాదును తీసుకున్న పోలీసులు యువతి మరణానికి బాధ్యుడైన యువకుడిపై కేసు నమోదు చేశారు. నిందితులు ఎవరైనా శిక్ష పడతుందని ఈ సందర్భంగా సీఐ మల్లికార్జున బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

Also Read:Dhanashree Verma: తల్లితో కలిసి కచా బాదం పాటకు కాలు కదిపిన చాహల్‌ సతీమణి.. నెటిజన్లను ఆకట్టుకుంటోన్న వీడియో..

Pushpa: సామీ సామీ పాటకు గర్భిణీ సూపర్‌ డ్యాన్స్‌.. నెటిజన్ల మది దోచుకుంటోన్న వైరల్‌ వీడియో..

Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఒకే వేదికపై రేవంత్‌ రెడ్డి, కోమటి రెడ్డి.. హ్యాపీ టైమ్స్ అంటూ టీపీసీసీ ట్వీట్‌..