Murder attempt:యువతి వెంటపడ్డాడు. ప్రేమపేరుతో వేధించాడు. ఆమె ఎంతచెప్పినా వినలేదు. దీంతో తండ్రికి ఈ వేధింపుల సంగతి చెప్పేసింది. ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా..? కూతుర్ని వేధిస్తున్న ఆ పోకిరీ భరతం పట్టాడు. కత్తికో కండగా నరికాడు. కృష్ణా జిల్లా(Krishna District) ఉయ్యూరు(Vuyyuru)లో ఈ ఘటన వెలుగు చూసింది. షారూఖా అనే యువకుడిపై కత్తితో దాడి చేశాడు అమ్మాయి తండ్రి షరీఫ్. కూతుర్ని వేధిస్తున్న షారూఖాపై తల్వార్‌తో దాడి చేశాడు. నడి రోడ్డుపైనే కత్తితో నరికాడు. గతంలో కూతురిపై షారూఖా వేధింపుల విషయంలోనే మందలించినా వినకపోవడంతో తన ఆగ్రహాన్ని ఇలా వెళ్లగక్కాడు. షారూఖా ముఖంపై రెండు వేటులు వేశాడు. దీంతో అతడి ముఖం చిద్రమైపోయింది. వెన్నులో రెండు పోట్లు పొడిచాడు. ఇలా పలుమార్లు.. వేర్వేరు ప్రాంతాల్లో నరికాడు షరీఫ్. అనంతరం కత్తితో సహా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ప్రస్తుతం షారూఖా పరిస్థితి విషమంగా ఉంది.
అనంతపురంలో వ్యక్తి దారుణ హత్య…
అనంతపురం నడిబొడ్డున జరిగింది ఈ దారుణ హత్య. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని వెంటాడి వెంటాడి అటాక్ చేశారు. రాడ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో నడిరోడ్డుపైనే ప్రాణాలు కోల్పోయాడు ఆ వ్యక్తి. గ్యాంగ్ వార్ సినిమాలను తలపించేలా జరిగిన ఈ దాడి కేసులో పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారంతా భవానీనగర్‌కు చెందిన ఆకతాయిలుగా గుర్తించారు. ప్రసాద్ అనే వ్యక్తి ఇన్నోవా వాహనంలో వస్తుండగా.. భవానీ నగర్ కు చెందిన ముగ్గరు యువకులు ఒకే బైక్ పై వచ్చి కారుకు తగిలారు. తన వాహనానికి బైక్ తగిలించారని ప్రశ్నించినందుకు..సుమారు 50 మంది అల్లరి మూకలను వెంట పెట్టుకుని వచ్చి ప్రసాద్‌పై రాడ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
మృతుడు ప్రసాద్ కు భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భవానీ నగర్ కు చెందిన కొందరు వ్యక్తులు తరచూ ఇలా గొడవలు పడటం.. గ్యాంగ్ లుగా వచ్చి దాడులకు పాల్పడుతుండటంతో భయంతో వణికిపోతున్నారు స్థానికులు.
Also Read: Andhra Pradesh: టమాటా లోడ్ అనుకుంటే పొరబడినట్లే.. లోపల చెక్ చేస్తే కళ్లు చెదిరాయి
గుంటూరు జిల్లా నుంచి మిర్చిలాంటి ప్లేయర్.. అండర్-19 వరల్డ్ కప్ విజయంలో కీ రోల్..