కూతురంటే చచ్చేంత ప్రేమ !..కన్నీళ్లు పెట్టించే ఘటన

ఆయనకు ఇద్దరు కూతుళ్లు...బిడ్డలంటే అతనికి వల్లమాలిన ప్రేమ. ఆ పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేడు. తన పంచప్రాణాలు తన ఇద్దరు కూతుళ్లే అనుకుని జీవిస్తున్నాడు. అటువంటి తరుణంలో..

కూతురంటే చచ్చేంత ప్రేమ !..కన్నీళ్లు పెట్టించే ఘటన

ఆయనకు ఇద్దరు కూతుళ్లు…బిడ్డలంటే అతనికి వల్లమాలిన ప్రేమ. ఆ పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేడు. తన పంచప్రాణాలు తన ఇద్దరు కూతుళ్లే అనుకుని జీవిస్తున్నాడు. అటువంటి తరుణంలో అతడి ఇద్దరు కూతుళ్లలో ఓ కూతురు అనుకోకుండా మరణించింది. కన్నబిడ్డ మరణవార్త తట్టుకోలని ఆ తండ్రి గుండెఆగిపోయింది. ఈ విషాద సంఘటన అందరినీ ఎంతగానో కలచివేసింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ విషాదం చోటు చేసుకుంది.. మచిలీపట్నం కుమ్మరిగూడెం ప్రాంతానికి చెందిన గిరిబాబు గోల్డ్ కవరింగ్‌ పని చేస్తుంటారు. అతనికి ఇద్దరి కూతుళ్లు ఉన్నారు. ఆ ఇద్దరంటే గిరిబాబుకు పంచ ప్రాణాలు. 6 నెలల క్రితం గిరిబాబు పెద్దమ్మాయి చనిపోయింది. ప్రసవ సమయంలో అస్వస్థతకు గురై రేణుకాదేవి మృతి చెందింది. అంతే అప్పటి నుంచి గిరిబాబు కన్నీళ్లు పెట్టని రోజే లేదు. కూతురు దూరమైందన బాధతో అతను తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఆరు నెలలు గడిచినా ఆ బాధ నుంచి కోలుకోలేకపోయారు. మానసికంగా కుంగిపోయారు. చివరకు కూతురు సమాధి వద్దే తన ప్రాణాలు వదిలేశారు.

ప్రతిరోజు గిరిబాబు తన కుమార్తె సమాధి వద్దకు వెళ్తుంటారు. అలా వెళ్లిన వ్యక్తి మళ్లీ తిరిగి రాలేదు. దీంతో అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికారు. ఇలా గాలించే క్రమంలో అనుమానంతో కూతురు సమాధి దగ్గర కూడా వెతకడంతో.. అక్కడ విగతజీవుడై గిరిబాబు పడి ఉన్నారు. పెద్ద కూతురు దూరం కావడంతో.. గిరిబాబు అప్పటి నుంచి మానసికంగా వేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. ఎవరు ఎంత నచ్చజెప్పినా అతను కోలుకోలేకపోయారని చెప్పుకొచ్చారు. నిత్యం పెద్ద కూతుర్ని తలుచుకుంటూ కుంగిపోయేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలు తిరగక ముందే ఆ ఇంట్లో మరో వ్యక్తి చనిపోవడం అందరిని కలిచి వేసింది. ఇప్పుడు ఆ ఇంటికి పెద్ద దిక్కు కూడా దూరం కావడంతో ఆ కుటుంబం గుండెలవిసేలా రోధిస్తోంది.