Crime News: కన్న తండ్రే కాల యముడు.. భార్యపై అనుమానంతో కూతురు గొంతు కోసి.. ఈ దారుణ సంఘటన..

|

Nov 01, 2021 | 9:36 AM

Crime News: కన్న తండ్రే కాల యముడు అయ్యాడు. కూతురు గొంతుకోసి కర్కషంగా హత్యచేశాడు. మానవత్వాన్నే ప్రశ్నార్థకంగా మార్చిన ఈ దారుణ సంఘటన చెన్నైలోని విల్లివాక్కంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

Crime News: కన్న తండ్రే కాల యముడు.. భార్యపై అనుమానంతో కూతురు గొంతు కోసి.. ఈ దారుణ సంఘటన..
Crime News
Follow us on

Crime News: కన్న తండ్రే కాల యముడు అయ్యాడు. కూతురు గొంతుకోసి కర్కషంగా హత్యచేశాడు. మానవత్వాన్నే ప్రశ్నార్థకంగా మార్చిన ఈ దారుణ సంఘటన చెన్నైలోని విల్లివాక్కంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాధాక్రిష్ణన్‌ (34) అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం లావణ్య (30) అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇద్దరు సంతానం ఉన్నారు. లావణ్య ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అంత సజావుగా సాగుతోందనుకుంటోన్న సమయంలో రాధాక్రిష్ణన్‌ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని వేధించడం మొదలు పెట్టాడు. ఈ విషయమై వీరిద్దరి మధ్య తగాదాలు జరుగుతూ వచ్చాయి. దీంతో భర్త వేధింపులను తట్టుకోలేని లావణ్య ఇటీవలే ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇద్దరు చిన్నారులతో జీవనం సాగిస్తోంది.

ఈ క్రమంలోనే శనివారం లావణ్య నివసిస్తోన్న ఇంటికి వెళ్లాడు రాధ క్రిష్ణన్‌. అయితే లావణ్య అప్పటికే ఇద్దరు కూతుర్లను ఇంట్లోనే వదిలేసి ఆసుపత్రికి వెళ్లిపోయింది. కోపంతో ఊగిపోయిన రాధక్రిష్ణన్‌ కూతురును లావణ్య గురించి రకరకల ప్రశ్నలు అడిగాడు. ఇంటికి ఎవరు వస్తున్నారు.? అంటూ ప్రశ్నలు సంధించాడు. దీంతో చిన్నారి సరైన సమాధానం చెప్పడకపోవడంతో.. వంట గదిలోకి వెళ్లి కత్తి తీసుకొచ్చిన నిందితుడు చిన్నారి గొంతు కోసేశాడు. దీంతో చిన్నారి ఒక్కాసారిగా అరవడంతో పక్కింటి వారంతా సంఘటన స్థలానికి చేరుకున్నారు.

రాధాకృష్ణన్‌ అప్పటికే సంఘటన స్థలం నుంచి పారిపోయాడు. తీవ్రంగా రక్తస్రావం అవుతూ ఇబ్బంది పడుతోన్న ఆ చిన్నారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆ బాలిక అప్పటికే మరణించింది. ఇదిలా ఉంటే చిన్నారి గొంతు కోసిన ఆ ప్రబుద్ధుడు నేరుగా పోలీస్‌ స్టేషన్‌ వెళ్లి లొంగిపోయాడు. పోలీసుల సమాచారం ప్రకారం ఆ చిన్నారి స్థానికంగా ఉన్న పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. ప్రస్తుతం రాధక్రిష్ణన్‌ను పోలీసులు రిమైండ్‌కు పంపించారు.

Also Read: Crime News: రూ. 6 వేలు కోసం దంపతుల మధ్య ఘర్షణ.. తెల్లవారేసరికి విగతజీవులుగా మారిన భార్యా, భర్త

LPG Price Rise: దీపావళి ముందు భారీ షాక్.. పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర..

Battery thiefs arrest: వీళ్లు మామూలు దొంగలు కాదు..జగత్‌ జంత్రీలు..! బ్యాటరీలు చోరీ ఏంటో మరీ.. (వీడియో)