Fake Whale Vomit: తిమింగలం వాంతి పేరుతో దోచేస్తున్నారు.. సీన్‌లోకి సులేమాన్‌ స్టోన్ కూడా

|

Jun 16, 2021 | 10:20 AM

సొసైటీలో మోస‌గాళ్లు పెరిగిపోతున్నారు. కొత్త త‌ర‌హా మోసాల‌తో పోలీసుల‌కు స‌వాల్ విసురుతున్నారు. తాజాగా తిమింగళం వాంతి పేరుతో మోసానికి య‌త్నస్తున్న....

Fake Whale Vomit: తిమింగలం వాంతి పేరుతో దోచేస్తున్నారు.. సీన్‌లోకి సులేమాన్‌ స్టోన్ కూడా
Whale Vomit Scam
Follow us on

సొసైటీలో మోస‌గాళ్లు పెరిగిపోతున్నారు. కొత్త త‌ర‌హా మోసాల‌తో పోలీసుల‌కు స‌వాల్ విసురుతున్నారు. తాజాగా తిమింగళం వాంతి పేరుతో మోసానికి య‌త్నస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుగంధ ద్రవ్యాల్లో వాడే అంబర్‌గ్రిస్‌(తిమింగలం వాంతి) పదార్థం తమ వద్ద ఉందని నకిలీ పదార్థాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలక్ట్రానిక్స్‌లో అతికించేందుకు వాడే గమ్‌ లాంటి పదర్థాన్ని అంబర్‌గ్రిస్‌గా చూపుతూ ఈ గ్యాంగ్ మోసాల‌కు తెగ‌బ‌డుతుంది.  అలాగే సులేమాన్‌ స్టోన్‌ ఉందని, దానిలో మహిమలు ఉన్నాయని చెబుతూ దాన్ని చేతిలో పట్టుకుంటే చేయి నరికినా ఏమీ కాదని నమ్మిస్తున్నారు. మరో అయస్కాంత ప్లేట్‌ ఉంది, అది బ్రిటన్‌ వారు వినియోగించారు, అది ఎంతో విలువైందని నకిలీ ప్లేటు చూపుతున్నారు.  ఖైరతాబాద్‌లోని ఎస్‌బీఐ వీధిలో ఓ గదిని కార్యాలయంగా మార్చుకుని వీరు మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. మొత్తం ఏడుగురు‌ నిందితులను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి‌ తీసుకున్నారు. షకీర్‌ అలీ, షేక్‌ అలీ, మహమ్మద్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ నజీర్‌, మోహన్‌లాల్‌ యాదవ్‌, మహమ్మద్‌ అజారుద్దీన్,మహమ్మద్‌ హుస్సానుద్దీన్లు గ్యాంగ్‌గా ఏర్ప‌డి.. ఈ త‌ర‌హా ఛీటింగ్ చేస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి నకిలీ సామగ్రిని స్వాధీనం చేసుకుని.. లోతైన ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. ఇప్పుటివ‌ర‌కు గుప్త నిధులు, రైస్ పుల్లింగ్ అంటూ జ‌నాల అమాయ‌క‌త్వాన్ని క్యాష్ చేసుకున్న కేటుగాళ్లు.. తాజాగా తిమింగ‌ళం వాంతి పేరుతో కొత్త త‌ర‌హా క్రైమ్‌కు తెర‌దీశారు.

Also Read: భార్య‌తోనే ఉంటా.. మైన‌ర్ బాలుడి మారాం.. చివ‌రకు కోర్టు ఏం చెప్పిందంటే.

తెలంగాణ‌లో ప‌లు ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువు పెంపు.. ఇవిగో వివ‌రాలు