ఫేక్ డీఎస్పీ నెల్లూరు స్వామి విషయంలో కొత్త, కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ముందు తాను మోసపోయాకే.. మిగిలిన వారిని మోసం చేసే గుణాన్ని అలవాటు చేసుకున్నాడు. అవును మీరు చదివింది నిజమే.. అందరిలాగే సామాన్య జీవితం ప్రారంభించిన నెల్లూరు స్వామి.. ఇంటర్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ఆశపడ్డాడు. ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానని ఓ ప్రముఖ వ్యక్తి.. 70 వేల రూపాయలు తీసుకున్నాడు. ఆ తర్వాత అతను హ్యాండివ్వడంతో.. మోసపోయాననే విషయం నెల్లూరు స్వామికి అర్ధమైంది. ఎస్సై ఉద్యోగం రాకపోవడంతో నకిలీ డిఎస్పీగా అవతారం ఎత్తాడు. ఎవరైతే మోసం చేశారో.. అదే వ్యక్తితో కలిసి సెటిల్మెంట్లు, దందాలకు తెరలేపాడు. సొంత జిల్లాలో అనుమానం రాకుండా హైదరాబాద్ కేంద్రంగా సెటిల్మెంట్‌లు మొదలుపెట్టారు. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సివిల్ సెటిల్మెంట్లు మొదలు పెట్టారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ వసూళ్లు షురూ చేశారు. అయితే ఆ సూత్రదారి పేరును బయటపెట్టడానికి మాత్రం పోలీసులు నిరాకరించారు.
గతంలో పని చేసిన టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ పీఏగా చెప్పుకుంటూ దందాలు చేశారు. హైదరాబాద్‌లోని స్వామి ఆఫీస్‌లో పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన విజిటింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు స్వామి ద్వారా.. ఆ సూత్రధారి రెండు కోట్లు వసూలు చేసినట్టు రిమాండ్ బేగంబజార్ డీఐ రవి తెలిపారు. మరోవైపు నెల్లూరు స్వామి బాధితులు మాత్రం ముందుకు రావడం లేదు. డబ్బులు ఇచ్చి ఉద్యోగం పొందే ప్రయత్నం చేసిన నేరం కింద కేసు నమోదవుతుందనే భయంతో ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: వరుడికి చిర్రెత్తుకొచ్చింది.. ఏకంగా పెళ్లి వేదిక నుంచే పారిపోయాడు.. షాకైన బంధువులు