Kamreddy Fake DSP: పోలీస్‌ డ్రస్‌లో హల్‌చల్.. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నకిలీ డిఎస్పీ నెల్లూరు స్వామి లీలలు..!

|

Jul 17, 2021 | 7:57 PM

అతడో నకిలీ ఖాకీ. వేసేది సీఐ యూనీఫాం చెప్పేది డీఎస్పీనని.. ఏంటితగాడి నకిలీ లీల? నిఘా పెట్టింది టీవీ9.. అడ్డంగా బుక్కైన కేటుగాడు.

Kamreddy Fake DSP: పోలీస్‌ డ్రస్‌లో హల్‌చల్.. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నకిలీ డిఎస్పీ నెల్లూరు స్వామి లీలలు..!
Fake Dsp Nellore Swamy In Kamareddy
Follow us on

Fake DSP Nellore Swamy in Kamareddy District: అతడో నకిలీ ఖాకీ. వేసేది సీఐ యూనీఫాం చెప్పేది డీఎస్పీనని.. ఏంటితగాడి నకిలీ లీల? నిఘా పెట్టింది టీవీ9.. నాకు వాళ్లు తెలుసు వీళ్లు తెలుసు.. తనదసలు హైరేంజ్ అంటూ బిల్డప్ ఇస్తాడు.. అధికారుల ఊరూ పేరు ఇతర హోదాలతో సహా చెప్పి నమ్మబలికేస్తాడు. దర్జాగా కుర్చీలో కూర్చుని సెటల్మెంట్లు చేస్తాడు. ఇంటర్ కూడా పాస్ కాలేదు… కానీ ఏకంగా డీఎస్పీ అయ్యాడు.. ఏంచక్కా.. యూనిఫామ్ వేసుకుని పోలీసు ఐడీతో డీఎస్పీగా దర్జాగా చలామణి అవుతూ.., ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ.. నకిలీ పాస్ బుక్కులు.. సెటిల్మెంట్లు చేస్తున్నాడు..ఇలా సంవత్సరాలుగా మోసం చేస్తున్నా..గురుడు నేటికి పట్టుబడ్డాడు.

అతడి పేరు నెల్లూరు స్వామి. ఉండేది కామారెడ్డి. జిల్లాకేంద్రంతో పాటు పలు చోట్ల ఖాకీ డ్రెస్సులేసుకుని మరీ సెటిల్‌మెంట్లు చేస్తూ టీవీ9 కంట చిక్కాడు. తాజాగా ఈ నకిలీ డీఎస్పీపై హైదరాబాద్‌లో కేసు నమోదయ్యింది. బేగంబజార్ పోలీసులు.. నెల్లూరు స్వామిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి నకిలీ పోలీసులతో తస్మాత్ జాగ్రత్త. అమాయకంగా ప్రతి ఒక్కరినీ నమ్మేసి.. మీ వివరాలు చెప్పి ఇరుక్కుపోకండి. సమస్య పరిష్కారం జరగక పోగా.. మీరే ఎదురు సమస్యల్లో చిక్కుంటారు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

కామారెడ్డి జిల్లా బీబీ పేట మండలం తుజల్‌పూర్ గ్రామానికి చెందిన నెల్లూరు స్వామి డీఎస్పీ వేషధారణలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు టార్గెట్ చేసుకొని లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డాడు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో అంతా మన వల్లే ఉన్నారంటూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురు ఉద్యోగులకు మాయామాటలు చెప్పి నమ్మించాడు.

ఇలా స్వామి తన గ్రామంలో కొందరితో కలిసి ముఠాగా ఏర్పడి ఒక్క కామారెడ్డి జిల్లానే కాకుండా కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్ ,మెదక్ జిల్లాలోనూ 20 మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల పేరిట నమ్మబలికాడు. ఒక్కొక్కరి నుండి రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిస్తోంది.. ఇలా అర్ధరాత్రి అయ్యిందంటే చాలు నెల్లూరు స్వామి పది మందితో కలిసి బీబీపేట, తుజల్ పూర్ బస్టాండ్ల వద్ద వాహనాన్ని నిలుపుకొని పోలీసుల విధులు నిర్వహిస్తూ మరి వసూళ్లకు పాల్పడేవాడని స్థానికులు చెబుతున్నారు.

ఉద్యోగాలతో పాటు తుజల్‌పూర్ గ్రామంలో నుండి వెళ్లే.. ఇసుక ట్రాక్టర్ల ను, టిప్పర్లు టార్గెట్ చేసుకొని స్వామి వసూళ్లకు పాల్పడేవాడని పోలీసు విచారణలో తేలింది. దీంతో పాటు నకిలీ పాస్ బుక్కులు తయారు చేయించి ఇవ్వడం, గ్రామానికి చెందిన వారికి హౌసింగ్ లోన్స్, పాసుబుక్ లపై లోన్లు ఇప్పించడం వంటి పనులు చేసేవాడు. అయితే, స్వామి విషయం తెలిసిన పోలీసులు సైతం ఇన్నాళ్లు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక, స్వామికి స్థానికంగా ఉండే ఓ రాజకీయ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి, ఆయన బంధువుల అండ ఉండడంతో మరింత రెచ్చిపోయాడు. ఇలా ఎవరి అడ్డు లేకపోవడంతో సంవత్సర కాలంగా స్వామి డీఎస్పీగా కొనసాగాడు. అయితే ఇటివలే.. స్వామి పై అనుమానం వచ్చిన కొందరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో.. హైదరాబాద్ బేగం బజార్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. దీంతో విచారణలో అతను పోలిస్ కాదని తేలిపోయింది.. దీంతో రంగంలోకి దిగిన స్పెషల్ పార్టీ పోలీసులు.. ఈ నెల 14 బుధవారం రాత్రి స్వామిని అతని ఇంటి వద్దనే అదుపులోకి తీసుకున్నారు.

Read Also….  Station Master: రైల్వే స్టేషన్‌లో తప్పతాగి గుర్రుపెట్టాడు.. వరుసగా ఆగిన రైళ్ళు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..