AP News: ఇంజినీరింగ్ విద్యార్థిని బలవన్మరణం.. కిలారు టవర్స్‌పై నుంచి దూకి..

|

Aug 02, 2022 | 5:55 AM

యునీలా ఆర్‌వీఆర్‌జేసీ కళాశాలలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతోంది. యునీలా స్వస్థలం నూజివీడు మండలం సూరేపల్లిగా పోలీసులు తెలిపారు.

AP News: ఇంజినీరింగ్ విద్యార్థిని బలవన్మరణం.. కిలారు టవర్స్‌పై నుంచి దూకి..
Suicide
Follow us on

Engineering Student Commits Suicide: ఏపీలోని గుంటూరు నగరంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. కొరిటెపాడులోని కిలారు టవర్స్‌ పైనుంచి కిందకు దూకి యునీలా అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. యునీలా ఆర్‌వీఆర్‌జేసీ కళాశాలలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతోంది. యునీలా స్వస్థలం నూజివీడు మండలం సూరేపల్లిగా పోలీసులు తెలిపారు. విద్యార్థిని సోమవారం తాను ఉంటున్న ప్రైవేటు హాస్టల్‌ భవనంపై నుంచి దూకి సూసైడ్‌ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గుంటూరు పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. యునీలా ఆత్మహత్యకు ఎందుకు పాల్పడింది.. అసలేం జరిగింది అనే విషయాల గురించి ఆరాతీస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకం రేపింది. యునీలా మృతికి సంబంధించి పూర్తి వివరాల్సి తెలియాల్సిఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి