భద్రాద్రి జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టుల మృతి

|

Sep 07, 2020 | 6:15 PM

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మరోసారి ఎదురు కాల్పులతో దద్దరిల్లింది. ఎన్‌కౌంటర్‌తో ప్రశాంతంగా ఉన్న గిరిజన పల్లెలు ఉలిక్కిపడ్డాయి. చర్ల ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

భద్రాద్రి జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టుల మృతి
Follow us on

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మరోసారి ఎదురు కాల్పులతో దద్దరిల్లింది. ఎన్‌కౌంటర్‌తో ప్రశాంతంగా ఉన్న గిరిజన పల్లెలు ఉలిక్కిపడ్డాయి. చర్ల ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అయితే, మృతులకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. మావోయిస్టులు మందుపాతర పేల్చిన గంటల వ్యవధిలోనే ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడం విశేషం. ఆదివారం అర్ధరాత్రి జిల్లాలోని చర్ల మండలం పగిడివాగు దగ్గర మావోయిస్టులు మందుపాతరను పేల్చారు. కాగా, దేవర్లపూడి ఎన్‌కౌంటర్‌కి నిరసనగా శబరి ఏరియా కమిటీ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈఎన్‌కౌంటర్‌కి ప్రతీకారంగా మావోయిస్టులు ఏదై నా ఘాతుకానికి పాల్పడుతారేమోననే అనుమానంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు రాష్ట్రాల సరిహద్దులోని అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మాజీ నక్సలైట్ల కదిలికలపై కూడా పోలీసులు నిఘా పెట్టినట్టు సమాచారం. గత కొద్దిరోజులుగా మన్యంలో మావోయిస్టుల కదలికలు కనిపిస్తుండడంతో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు.