Drugs Cases: కొన్ని రాష్ట్రాల్లో నేరాలు, డ్రగ్స్ దందా పెరిగిపోతోంది. ఇలాంటి దందాలు జరుగకుండా పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. తాజా గణాంకాలు ఆ రాష్ట్రాన్ని ఆందోళనలో నెట్టేస్తున్నాయి. పంజాబ్ చాలా కాలంగా డ్రగ్స్ సమస్యతో పోరాడుతోంది. డ్రగ్స్‌కు సంబంధించిన కేసులలో ఇప్పటికీ మొదటి స్థానంలో ఉంది. పంజాబ్‌లో మొత్తం నేరాలు తగ్గాయి. అయితే PDPS చట్టం కింద నమోదైన డ్రగ్స్‌కు సంబంధించిన కేసులలో పంజాబ్ మొదటి స్థానంలో ఉంది. పంజాబ్‌లో నేరాల రేటు చాలా ఎక్కువగా ఉంది. పిల్లలపై నేరాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. గణాంకాల ఆధారంగా.. నేరాల పరంగా పంజాబ్ పరిస్థితి దారుణంగా ఉంది. ఇక మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసులలో పంజాబ్ మొదటి స్థానంలో ఉంది. పంజాబ్‌లో నేరాల రేటు 32.9 శాతంగా ఉంది. ఇక క్రైమ్ రేట్‌లో హిమాచల్ ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. దీని తర్వాత అరుణాచల్ ప్రదేశ్, కేరళ, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు ఉన్నాయి.
మొత్తం నేరాల విషయానికొస్తే, పంజాబ్‌లో కేసుల సంఖ్య తగ్గింది. 11 శాతం కేసులు తగ్గుముఖం పట్టాయి. 2021లో పంజాబ్‌లో 757 హత్యలు, 826 హత్యలు, 508 అత్యాచార కేసులు నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో బాలలకు సంబంధించిన నేరాలు పెరిగాయి. ఈ నేరాలు 20 శాతం పెరిగాయి. ఇందులో కిడ్నాప్, పిల్లల హత్య, పోక్సో కేసులు ఉన్నాయి. ఇలా నేరాల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన నెలకొంది. నేరాల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం, పోలీసు శాఖ తీవ్రంగా కృషి చేస్తోంది. అయినా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి