Hyderabad: పక్కింటివారితో చిన్న వివాదం.. పరస్పరం దాడి చేసుకున్న రెండు ఫ్యామిలీలు!

కొన్ని సార్లు చిన్న చిన్న గొడవలే చిలికిచిలికి పెద్ద వివాదంగా మారుతాయి. ఇలానే హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్-ముషీరాబాద్ ప్రాంతంలో పక్కింటి వారితో ఓ విషయంలో మొదలైన చిన్న గొడవ ఒకరిపై ఒకరు దాడి చేసుకునేవరకు వెళ్లింది. ఈ గొడవ ఘర్షణలకు పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వివరాల్లోకి వెళ్తే..

Hyderabad: పక్కింటివారితో చిన్న వివాదం.. పరస్పరం దాడి చేసుకున్న రెండు ఫ్యామిలీలు!
Hyderabad Incident

Edited By: Anand T

Updated on: Apr 19, 2025 | 11:45 AM

ముషీరాబాద్ బోలక్​పూర్ ప్రాంతంలో జరిగిన సంఘటనలో స్థానికంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జోలక్‌పూర్‌లో నివసించే అక్రమ్ అనే వ్యక్తికి తన ఇంటికి పక్కనే ఉండేవారితో.. కొన్ని చిన్న చిన్న విషయాల్లో కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పక్కింటి వారి కుటుంబ సభ్యులు అక్రమ్‌ తండ్రిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్టు తెలుస్తోంది. అడ్డుకోబోయిన అక్రమ్‌, అతని సోదరుడిపై కూడా నూర్ కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో దాడి చేసి గాయాలపాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర దుమారం రేగింది. ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ విరుచుకుపడ్డారు. ఈ వివాదానికి పాత గొడవలే కారణంగా తెలుస్తోంది.

అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ గొడవలో గాయపడిన అక్రమ్‌, అతనికి సంబంధించిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసిన ముషీరాబాద్ పోలీసులు.. గొడవలకు గల కారణాలపై ఆరా తీశారు. గొడవలకు పాత వివాదాలే కారణమా లేదా ఇంకేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…