దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచార ఘటన అందరికీ గుర్తు ఉంటుంది. ఈ కేసు విషయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. టాలీవుడ్‌కు చెందిన రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్‌కు చెందిన సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ సహా మొత్తం 38 మంది సెలబ్రిటీలను అరెస్ట్ చేయాలంటూ కేసు ఫైల్ అయ్యింది. వీరు చేసిన తప్పేంటి అనుకుంటున్నారా. నవంబర్ 27, 2019న హైదరాబాద్‌లో ఓ యువతిని నలుగురు దుర్మార్గులు అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేసిన విషయం తెలిసిందే. బాధిత యువతి కుటుంబానికి ఇబ్బందులు తలెత్తకుండా.. ఆమెను దిశ అనే పేరుతో సంభోదించారు. ఇలాంటి దారుణ ఘటనలు జరిగినప్పుడు అసలు పేర్లను ఉపయోగించకుండా మారు పేర్లను పెడుతుంటారు. అయితే దిశ ఘటన జరిగినప్పుడు మాత్రం పలువురు సెలబ్రిటీలు ఆమె ఒరిజినల్ నేమ్ ఉపయోగించారు. కొందరైతే ఫోటో కూడా వాడారు. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, అనుపమ్ ఖేర్, ఫర్హాన్ అక్తర్ సల్మాన్‌ఖాన్ సహా టాలీవుడ్ స్టార్స్ రవితేజ, అల్లు శిరీష్, రకుల్ ప్రీత్ సింగ్, ఛార్మి బాధిత అమ్మాయి పేరుని సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశారు. ఇలాంటి సందర్భాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించి నలుగురుకి ఆదర్శంగా నిలవాల్సిన సెలబ్రిటీలు అనుసరించిన విధానం సరిగా లేదంటూ ఢిల్లీకి చెందిన గౌరవ్ గులాటి అనే న్యాయవాది సబ్జీ మండీలోని పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 228 ఏ కింద కేసు పెట్టారు. అంతేకాదు వీరిని అరెస్ట్ చేయాలంటూ ఢిల్లీ తీస్ హజారీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌ను డ్రగ్స్ కేసు పట్టి పీడిస్తోంది. ఈ క్రమంలో ఈ కొత్త కేసు వ్యవహారం చర్చనీయాంశమైంది.
Also Read: Bigg Boss 5 Telugu: తనని తాను మార్చుకున్న ప్రియాంకా సింగ్‌కు బిగ్ బాస్ ఓ గోల్డెన్ ఛాన్స్
ఇంజిన్ లేదు, ఇంధనం అవసరం లేదు.. అయినా 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం