Viral Video: తుపాకులతో షాపులోకి ఎంట్రీ.. గన్స్‌తో బెదిరించారు.. కట్‌చేస్తే.. వీడియో వైరల్..
Three robbers loot in shop: దేశ రాజధాని ఢిల్లీలో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు తుపాకీలతో షాపులోకి ప్రవేశించిన దొంగలు.. యజమానిని బెదిరించి నగదును దోచుకెళ్లారు. ఈ షాకింగ్ సంఘటన
Three robbers loot in shop: దేశ రాజధాని ఢిల్లీలో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు తుపాకీలతో షాపులోకి ప్రవేశించిన దొంగలు.. యజమానిని బెదిరించి నగదును దోచుకెళ్లారు. ఈ షాకింగ్ సంఘటన ఢిల్లీలోని ఖేరా ఖుర్ద్ హౌస్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఖేరా ఖుర్ద్ హౌస్ ప్రాంతంలో ఓ హర్డ్‌వేర్ దుకాణంలోకి శనివారం ముగ్గురు దుండగులు ముసుగులు ధరించి తుపాకీలతో దూసుకొచ్చారు. ఇద్దరు హెల్మెట్లను ధరించి రాగా.. మరొకరు ముఖానికి వస్త్రాన్ని కప్పుకొని కనిపించాడు. ఈ సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాక దుకాణ యజమాని బిక్కుబిక్కుమంటూ నిల్చుండిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుండగులు దుకాణంలోకి ప్రవేశించగానే.. అక్కడ ఉన్న ఓ వ్యక్తిని పక్కకు నెట్టారు. అనంతరం నగదు కౌంటర్ వద్ద ఉన్న యజమానికి గన్ షాట్ పెట్టి పక్కకు నెట్టారు. అనంతరం కౌంటర్ తెరచి నగదు తీసుకున్నారు. ఈ దోపిడీ అక్కడున్న మొత్తం సీసీ ఫుటేజీలో కనిపించింది. ఈ వీడియోను ఆదివారం పోలీసులు విడుదల చేశారు.
వీడియో..
#WATCH | Two unknown miscreants looted a hardware shop at gunpoint in Delhi’s Khera Khurd area, yesterday pic.twitter.com/DI8Izx5Ky1
— ANI (@ANI) September 5, 2021
దొంగతనం సమయంలో దుండగులు చాలా తెలివిగా వ్యవహరించారు. కౌంటర్‌ను టిష్యూతో తెరిచారు. దీంతో వారి వేలిముద్రలు గుర్తించడం కష్టంగా మారింది. మాస్క్‌లు, హెల్మెట్ ధరించి రావడంతో వారిని గుర్తించడం కష్టంగా మారిందంటూ పలువురు పేర్కొంటున్నారు. అనంతరం యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. ఇది పాత నేరస్థుల పని అయివుంటుందని ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
Also Read: